టీ20 వరల్డ్‌కప్-2024 ఘనంగా ముగిసింది. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌ను టీమిండియా ఎగురేసుకోపోయింది. టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు కీలకమైన ఫైనల్లోనూ సత్తాచాటింది. శనివారం బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన భారత జట్టు.. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్‌కప్‌ను తమ ఖాతాలో వేసుకుంది.
భారత జట్టుకు సారథిగా వరల్డ్‌కప్ ట్రోఫీని అందించాలన్న రోహిత్ శర్మ కల ఎట్టకేలకు నేరవేరింది. అదే విధంగా భారత్‌కు వరల్డ్‌కప్‌ను అందించి తన ప్రస్ధానాన్ని ముగించాలన్న రాహుల్ ద్రవిడ్ కోరిక కూడా ఈ విజయంతో తీరింది.
వీరిద్దరితో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం తన కెప్టెన్ సాధించలేకపోయిన ట్రోఫీని.. కనీసం ఆటగాడిగానైనా దక్కించుకున్నందుకు ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు విరాట్ కోహ్లి, రోహిత్ గుడ్ బై చెప్పగా.. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా భారత జట్టుతో తన ప్రయాణాన్ని ముగించాడు.
ముగిసిన రాహుల్ ద్రవిడ్ ప్రస్ధానం..
భారత పురుషల జట్టు హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప్రస్ధానం ముగిసింది. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నద్రవిడ్.. తన మార్క్‌ను కోచింగ్‌లోనూ చూపించాలనుకున్నాడు.
ఈ క్రమంలోనే 2021 నవంబరులో రవి శాస్త్రి నుంచి భారత హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించాడు. అయితే హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. 2013 నుంచి భారత్‌ను ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని సాధించడమే లక్ష్యంగా ద్రవిడ్ పెట్టుకున్నాడు.
ఇది అతడి లక్ష్యం మాత్రమే కాదు అతడి ముందు ఉన్న సవాలు కూడా. ఎందుకంటే ద్వైఫాక్షిక సిరీస్‌లలో మాత్రమే అదరగొడుతుందని, ఐసీసీ టోర్నీల్లో మాత్రం తేలిపోతుందన్న ఆపఖ్యాతి అప్పటికే భారత్ మూటకట్టుకుంది. ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆరంభంలో అన్ని ఎదురుదెబ్బలే తగిలాయి.
2022 ఆసియాకప్, టీ20 ప్రపంచకప్-2022లోద్రవిడ్ నేతృత్వంలోని టీమిండియా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత డబ్ల్యూటీసీ-2023 ఫైనల్ చేరినప్పటకి.. అక్కడ కూడా మళ్లీ నిరాశే. ఆసీస్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. దీంతో ఎంతమంది కోచ్‌లు మారిన ఐసీసీ టోర్నీల్లో భారత్ తల రాత మారలేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
కానీ ద్రవిడ్ ఎక్కడా కుంగిపోలేదు. ఆటగాళ్లకు మద్దతుగా ఉంటూ జట్టును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే వన్డే వరల్డ్‌కప్-2023లో సత్తాచాటిన టీమిండియా ఫైనల్‌కు చేరింది. ఆ మెగా టోర్నీలో భారత్ ప్రదర్శన చూసి అంతా కప్ మనదే అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఆసీస్ చేతిలో తుది మెట్టుపై భారత్ బోల్తా పడింది. మళ్లీ ద్రవిడ్‌కు నిరాశే మొదలైంది.
గతేడాది వన్డే వరల్డ్‌కప్‌తో తన పదవీ కాలం ముగిసినప్పటికి మరో ఏడాది తన కాంట్రాక్ట్‌ను పొడిగించాడు. ఈ సారి ఎలాగైనా కప్ కొట్టే తన ప్రస్ధానాన్ని ముగించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. మిషన్ టీ20 వరల్డ్‌కప్ 2024ను ద్రవిడ్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒకప్పుడు మైదానంలో బౌలర్ల ఓపికను పరీక్షించిన ద్రవిడ్‌కు.. ఈ నిరీక్షణ పెద్ద లెక్కేమి కాదు.
గతం గతహా అన్నట్లు ఆటగాళ్లను పొట్టి ప్రపంచకప్ కోసం అన్ని విధాలగా సన్నద్దం చేశాడు. సెలక్టర్లు, కెప్టెన్ రోహిత్‌తో కలిసి గొప్ప సమన్వయంతో వ్యవహరించిన ద్రవిడ్ 24 మంది ఆటగాళ్లతో కూడిన ఒక పూల్‌న్ని సిద్దం చేశాడు. ప్రపంచకప్‌కు కొన్ని నెలల ముందు భారత జట్టు తరఫున ఆడిన ఆటగాళ్లంతా ఈ పూల్‌లోని వాళ్లే.
ఇందులో నుంచి 15 మంది అత్యుత్తమ ఆటగాళ్లను టీ20 వరల్డ్‌కప్-2024కు ఎంపిక చేశారు. ఈ 15 మంది సభ్యుల బృందం వరల్డ్‌కప్‌లో తలపడేందుకు అమెరికా గడ్డపై అడుగుపెట్టింది. ఈ టోర్నీ తొలి మ్యాచ్ నుంచే ద్రవిడ్ తెర వెనుకుండి జట్టును నడిపించాడు. రోహిత్‌కు విలువైన సూచనలు ఇస్తూ ఫైనల్‌కు చేర్చాడు.
ఫైనల్లో తీవ్ర ఒత్తిడిలోనూ ఆటగాళ్లకు సపోర్ట్‌గా ఉంటూ కప్పు కొట్టేలా చేశాడు. ఆఖరికి పట్టువదలని విక్రమార్కుడిలా వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడి హెడ్ కోచ్‌గా తన ప్రయాణాన్ని ముగించాడు. ఆఖరిగా తన కెరీర్‌లో ఆటగాడిగా, కెప్టెన్‌గా సాధించని వరల్డ్‌కప్ టైటిల్‌ను కోచ్‌గా సాధించి ద్రవిడ్ చరిత్ర సృష్టించాడు. అందుకే విజయం సాధించిన అనంతరం ద్రవిడ్ కప్‌ను పట్టుకుని చిన్న పిల్లాడిలా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
కోచ్‌గా ద్రవిడ్ రికార్డులు ఇవే..
భారత్ 24 టెస్టుల్లో 14 గెలిచి మూడింట్లో ఓడింది.
13 వన్డే ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్ పదింటిని గెలుచుకుంది. అలాగే రోహిత్-ద్రవిడ్ కాంబినేషన్‌లో ఆడిన 56 మ్యాచ్‌ల్లో 41 విజయాలున్నాయి.
77 టీ20 మ్యాచ్‌ల్లో 56 గెలిచింది.
Never expected idhi #RahulDravid 😂❤️
pic.twitter.com/n7o3Ffa83O— Harsha... (@harshatweets03) June 29, 2024
Comments
Please login to add a commentAdd a comment