టీమిండియా విన్నింగ్ సెల‌బ్రేష‌న్స్‌.. చిన్న పిల్లాడిలా మారిన ద్ర‌విడ్‌! వీడియో | Rahul Dravid unleashes his wild side in neverseen before celebrations | Sakshi
Sakshi News home page

టీమిండియా విన్నింగ్ సెల‌బ్రేష‌న్స్‌.. చిన్న పిల్లాడిలా మారిన ద్ర‌విడ్‌! వీడియో

Published Sun, Jun 30 2024 12:55 PM | Last Updated on Sun, Jun 30 2024 1:24 PM

Rahul Dravid unleashes his wild side in neverseen before celebrations

టీమిండియా కల నేరవేరింది. గత 11 ఏళ్లగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ ఎట్టకేలకు భారత్ సొంతమైంది. టీ20 వరల్డ్‌కప్‌-2024లో భాగంగా బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించిన భారత జట్టు.. రెండో పొట్టి ప్రపంచకప్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. 

భారత్‌కు ఇది రెండో టీ20 వరల్డ్‌కప్ కాగా.. ఓవరాల్‌గా నాలుగో ఐసీసీ ట్రోఫీ కావడం విశేషం. అయితే సుధీర్ఘ నిరీక్షణకు తెరపడడంతో భారత ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేవు. భావోద్వేనికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. 

కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, సిరాజ్ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే కప్ అందుకునే సమయంలో మాత్రం భారత ఆటగాళ్లు నవ్వుతూ సంబరాల్లో మునిగి తేలిపోయారు. భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అయితే చిన్నపిల్లాడిలా ప్లేయర్స్‌తో కలిపి సెలబ్రేషన్స్ జరపుకున్నాడు. 

ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే ద్రవిడ్ ఈ తరహా సెలబ్రేషన్స్ చేసుకోవడం అందరిని కట్టిపడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

కాగా ద్రవిడ్‌కు భారత జట్టు హెడ్ కోచ్‌గా ఇదే చివరి మ్యాచ్ కావడం గమనార్హం. టీ20 వరల్డ్‌కప్‌-2024తో భారత హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ పదవీ కాలం ముగియనుంది. అదే విధంగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి తప్పుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement