
కొలంబో: ఈ ఏడాది ప్రపంచకప్‌లో పేలవమైన ఆటతీరుతో ఇంటా, బయటా విమర్శలు ఎదుర్కొన్న శ్రీలంక క్రికెట్‌లో ప్రక్షాళన మొదలైంది. ఆ జట్టు హెడ్ కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన మికీ ఆర్థర్‌ను శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం నియమించింది. అతనితో పాటు జింబాబ్వే ఆటగాడు గ్రాంట్ ఫ్లవర్‌ను బ్యాటింగ్ కోచ్‌గా, ఆ్రస్టేలియాకు చెందిన డేవిడ్ సకేర్‌ను బౌలింగ్ కోచ్‌గా, షేన్ మెక్‌డెర్మట్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. ఆర్థర్ గతంలో దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, పాకిస్తాన్ జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు.