
స్వీడన్ : క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడిప్పుడే అడుగు పెట్టిన స్వీడన్ తమ దేశంలో ఆట అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్ హెడ్ కోచ్‌గా నియమించింది. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ప్రస్తుతం వ్యవహరిస్తున్న 51 ఏళ్ల రోడ్స్... టోర్నీ ముగిసిన వెంటనే కుటుంబంతో సహా స్వీడన్‌లో స్థిరపడనున్నాడు. సఫారీ జట్టు తరఫున జాంటీ 52 టెస్టులు, 245 వన్డేలు ఆడాడు.