పాకిస్తాన్‌ హెడ్‌ కోచ్‌గా మాజీ దిగ్గజ ఆటగాడు! | Saqlain Mushtaq Set to Become Pakistan Head Coach For T20 World Cup 2021 | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ హెడ్‌ కోచ్‌గా మాజీ దిగ్గజ ఆటగాడు!

Published Thu, Sep 30 2021 3:37 PM | Last Updated on Thu, Sep 30 2021 3:39 PM

Saqlain Mushtaq Set to Become Pakistan Head Coach For T20 World Cup 2021 - Sakshi

Saqlain Mushtaq set to become Pakistan’s head coach  టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్‌ క్రికెట్‌లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఆ జట్టు హెడ్‌కోచ్‌గా సక్లైన్ ముష్తాక్‌ను ఆ దేశ క్రికెట్‌ బోర్డు నియమించబోతున్నట్లు సమాచారం. అంతకముందు టీ20 ప్రపంచకప్‌కు జట్టు ఎంపికలో  తమ అభిప్రాయానికి విలువ ఇవ్వలేదనే కారణంగా పాకిస్తాన్‌  హెడ్‌కోచ్ మిస్బా వుల్‌ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో జరిగే హోమ్ సిరీస్‌కు తత్కాలిక హెడ్‌ కోచ్‌గా ముష్తాక్‌ను  పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు నియమించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా కివిస్‌ పాక్‌ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేఫథ్యంలో తత్కాలిక హెడ్‌ కోచ్‌గా ఉన్న ముష్తాక్‌ను  టీ20 ప్రపంచకప్‌ వరకు పొడిగించే యోచనలో ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా పాక్‌ తరుపున 49 టెస్ట్‌లు, 169 వన్డేలు ఆడిన ముస్తాక్‌ వరుసగా 208, 288 వికెట్లు సాధించాడు. గతంలో ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్ స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా పనిచేశారు.  ఆదేవిధంగా ఆసీస్‌ మాజీ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హెడెన్‌ను  బ్యాటింగ్‌ కోచ్‌గా, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ వర్నన్ ఫిలందర్‌ను బౌలింగ్‌ కోచ్‌గా  ఎంపిక చేసిన విషయం తెలిసిందే. గ్రూప్ 2లో భాగంగా అక్టోబ‌ర్ 24న పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో టీమిండియాతో తలపడనుంది

పాకిస్తాన్ టీ20 జట్టు: బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్‌ కెప్టెన్‌), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్.

చదవండి: Ashwin Vs Morgan: గొడవ పడ్డానా... మౌనం వీడిన అశ్విన్‌.. వరుస ట్వీట్లు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement