డబ్ల్యూపీఎల్-2024 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ మహిళల జట్టు హెడ్‌కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ల్యూక్ విలియమ్స్‌ను నియమించింది. కాగా మహిళల ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్‌లో ఆర్సీబీ జట్టు ఘోర ప్రదర్శన కనబరిచింది.
డబ్ల్యూపీఎల్-2023లో 8 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ క్రమంలోనే మొదటి ఎడిషన్ ప్రధాన కోచ్‌గా బెన్ సాయర్‌పై ఆర్సీబీ వేటు వేసింది. బెన్ సాయర్ స్ధానాన్ని ల్యూక్ విలియమ్స్ భర్తీ చేయనున్నాడు. కాగా కోచ్‌గా విలియమ్స్‌కు ఆపారమైన అనుభవం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఫ్రాంచైజీలకు అతడు కోచ్‌గా పనిచేశాడు.
మహిళల బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్‌కు నాలుగు సీజన్ల పాటు విలియమ్స్ కోచ్‌గా వ్యవహరించాడు. అదే విధంగా ది హాండ్రడ్ లీగ్‌లో సదరన్ బ్రేవ్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా అతడు పనిచేశాడు. అదే విధంగా ఆస్ట్రేలియాలోని ఉమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్‌లో సౌత్ ఆస్ట్రేలియన్ స్కార్పియన్స్ జట్టుకు కూడా తన సేవలు అందించాడు.
చదవండి: Asian Games 2023: మలేషియాతో మ్యాచ్ రద్దు.. సెమీఫైనల్‌కు చేరిన టీమిండియా
Comments
Please login to add a commentAdd a comment