కెన్యా క్రికెట్ బోర్డు గత నెలలో తమ జట్టు హెడ్‌కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ దొడ్డా గణేష్‌ను నియమించిన సంగతి తెలిసిందే. అయితే నెలల రోజుల తిరిగకముందే కెన్యా క్రికెట్ దొడ్డా గణేష్‌కు ఊహించని షాకిచ్చింది. గణేష్‌తో చేసుకున్న ఒప్పందాన్ని కెన్యా క్రికెట్ బోర్డు రద్దు చేసింది.
ఈ నెల ఆఖరిలో ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2027 ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో కెన్యా జట్టు హెడ్‌కోచ్‌లగా లామెక్ ఒన్యాంగో, జోసెఫ్ అంగారా తిరిగి బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా దొడ్డా గణేష్ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ఈ క్రమంలోనే గణేష్ కాంట్రాక్ట్ రద్దు చేయాలని క్రికెట్ కెన్యా తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఆగస్టులో నైరోబీలోని సిక్కు యూనియన్ క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో దొడ్డా గణేష్‌తో ఏడాది పాటు తమ జట్టు హెడ్‌కోచ్‌గా కెన్యా క్రికెట్ ఒప్పందం కుదుర్చుకుంది. వన్డే ప్రపంచకప్‌లో కెన్యా మళ్లీ భాగమయ్యేలా కృష్టి చేస్తానని గణేష్ హామీ ఇచ్చాడు. కానీ అంతలోనే అతడి కాంట్రాక్‌ను కెన్యా క్రికెట్ రద్దు చేసింది.
ఎవరీ దొడ్డ గణేష్..?
కాగా కర్ణాటకకు చెందిన దొడ్డ గణేష్ 1997లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అయితే, అదే ఏడాది తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడేశాడు. భారత్ తరఫున మొత్తంగా నాలుగు టెస్టులు, ఒక వన్డే ఆడిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ టెస్టుల్లో 25, వన్డేలో నాలుగు పరుగులు చేశాడు.
అదే విధంగా టెస్టుల్లో ఐదు, వన్డేలో ఒక వికెట్ తీశాడు. అయితే, దొడ్డ గణేశ్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మాత్రం ఘనమైన రికార్డు ఉంది. మొత్తంగా 193 దేశవాళీ మ్యాచ్‌లు ఆడిన గణేశ్ 493 వికెట్లు తీయడంతో పాటు 2548 పరుగులు సాధించాడు.
చదవండి: #Shreyas Iyer: 'అతడు ఆటను గౌరవించడు.. జట్టులో చోటు దండగ'
Comments
Please login to add a commentAdd a comment