Dodda Ganesh
-
భారత మాజీ క్రికెటర్‌కు షాక్.. నెల రోజులకే హెడ్‌కోచ్ పోస్ట్ ఊస్ట్?
కెన్యా క్రికెట్ బోర్డు గత నెలలో తమ జట్టు హెడ్‌కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ దొడ్డా గణేష్‌ను నియమించిన సంగతి తెలిసిందే. అయితే నెలల రోజుల తిరిగకముందే కెన్యా క్రికెట్ దొడ్డా గణేష్‌కు ఊహించని షాకిచ్చింది. గణేష్‌తో చేసుకున్న ఒప్పందాన్ని కెన్యా క్రికెట్ బోర్డు రద్దు చేసింది.ఈ నెల ఆఖరిలో ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2027 ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో కెన్యా జట్టు హెడ్కోచ్లగా లామెక్ ఒన్యాంగో, జోసెఫ్ అంగారా తిరిగి బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా దొడ్డా గణేష్ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే గణేష్ కాంట్రాక్ట్ రద్దు చేయాలని క్రికెట్ కెన్యా తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఆగస్టులో నైరోబీలోని సిక్కు యూనియన్ క్లబ్లో జరిగిన ఓ కార్యక్రమంలో దొడ్డా గణేష్‌తో ఏడాది పాటు తమ జట్టు హెడ్‌కోచ్‌గా కెన్యా క్రికెట్ ఒప్పందం కుదుర్చుకుంది. వన్డే ప్రపంచకప్‌లో కెన్యా మళ్లీ భాగమయ్యేలా కృష్టి చేస్తానని గణేష్ హామీ ఇచ్చాడు. కానీ అంతలోనే అతడి కాంట్రాక్‌ను కెన్యా క్రికెట్ రద్దు చేసింది.ఎవరీ దొడ్డ గణేష్..?కాగా కర్ణాటకకు చెందిన దొడ్డ గణేష్ 1997లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అయితే, అదే ఏడాది తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడేశాడు. భారత్ తరఫున మొత్తంగా నాలుగు టెస్టులు, ఒక వన్డే ఆడిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ టెస్టుల్లో 25, వన్డేలో నాలుగు పరుగులు చేశాడు.అదే విధంగా టెస్టుల్లో ఐదు, వన్డేలో ఒక వికెట్ తీశాడు. అయితే, దొడ్డ గణేశ్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం ఘనమైన రికార్డు ఉంది. మొత్తంగా 193 దేశవాళీ మ్యాచ్‌లు ఆడిన గణేశ్ 493 వికెట్లు తీయడంతో పాటు 2548 పరుగులు సాధించాడు.చదవండి: #Shreyas Iyer: 'అతడు ఆటను గౌరవించడు.. జట్టులో చోటు దండగ' -
కెన్యా క్రికెట్ జట్టు హెడ్‌కోచ్‌గా భారత మాజీ క్రికెటర్
కెన్యా పురుషుల క్రికెట్ జట్టు హెడ్‌కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ నియమితుడయ్యాడు. కెన్యా క్రికెట్ బుధవారం ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్ సమీపిస్తున్న తరుణంలో కొత్త కోచ్‌ను నియమించుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా దొడ్డ గణేశ్ మాట్లాడుతూ.. కెన్యా జట్టును ప్రపంచకప్ పోటీలో నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని పేర్కొన్నాడు.చాంపియన్లు ఉన్నారుగతంలో ఏం జరిగిందన్న విషయంతో తనకు సంబంధం లేదని.. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారని గణేశ్ అన్నాడు. కెన్యాలో చాంపియన్లకు కొదవలేదని.. వారితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. కాగా కర్ణాటకకు చెందిన దొడ్డ గణేశ్ 1997లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అయితే, అదే ఏడాది తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడేశాడు.భారత్ తరఫున మొత్తంగా నాలుగు టెస్టులు, ఒక వన్డే ఆడిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ టెస్టుల్లో 25, వన్డేలో నాలుగు పరుగులు చేశాడు. అదే విధంగా టెస్టుల్లో ఐదు, వన్డేలో ఒక వికెట్ తీశాడు. అయితే, దొడ్డ గణేశ్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం ఘనమైన రికార్డు ఉంది. మొత్తంగా 193 దేశవాళీ మ్యాచ్‌లు ఆడిన గణేశ్ 493 వికెట్లు తీయడంతో పాటు 2548 పరుగులు సాధించాడు.ప్రపంచకప్‌నకు అర్హత సాధించడమే లక్ష్యంగాటీ20 ప్రపంచకప్-2026కు అర్హత సాధించే క్రమంలో కెన్యా తొలుత ఆఫ్రికన్ దేశాల జట్లతో పోటీపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరులో జరుగనున్న ఐసీసీ డివిజన్ 2 చాలెంజ్ లీగ్ సందర్భంగా కెన్యా హెడ్‌కోచ్‌గా దొడ్డ గణేశ్ ప్రయాణం మొదలుకానుంది. ఇక అక్టోబరులో తొలుత పపువా న్యూగినియా, ఖతార్, డెన్మార్క్ జట్లతో ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో తలపడనున్న కెన్యా జట్టుకు మార్గదర్శనం చేయనున్నాడు.గతంలోనూకాగా గతంలోనూ భారత క్రికెటర్లు విదేశీ జట్లకు కోచ్‌లుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అఫ్గనిస్తాన్ బౌలింగ్ కోచ్‌గా మనోజ్ ప్రభాకర్, ఆస్ట్రేలియా స్పిన్ బౌలింగ్ కోచ్‌గా శ్రీధరన్ శ్రీరామ్, ఒమన్ కోచ్‌గా సునిల్ జోషి తదితరులు పనిచేశారు. ఇక టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్‌గా మరో భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టును గైడ్ చేసిన రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్ ఆ పగ్గాలను చేపట్టాడు.చదవండి: పదిహేడేళ్ల వయసులో తొలి శతకం.. సచిన్‌కు సాటెవ్వరు!Cricket Kenya unveil former aindian International cricketer Dodda Ganesh as the new men's National Team head coach. Kenya will face Papua New Guinea, Qatar, Denmark and Jersey in the ICC Division 2 Challenge League in September and T20 World Cup Africa Qualifiers in October. pic.twitter.com/om0jahHMIy— Nami Nation (@namination254) August 13, 2024 -
IPL 2022: మీ వల్ల కాదన్న లక్నో.. అదిరిపోయే కౌంటర్ వేసిన ఆర్సీబీ!
IPL 2022 RCB Vs LSG: ఐపీఎల్ ఫ్రాంఛైజీలు సోషల్ మీడియా వేదికగా పరస్పరం ట్రోల్ చేసుకోవడం సహజమే. ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఉన్న సందర్భంలో గెలుపోటముల గురించి అంచనా వేస్తూ సరదాగా పంచ్‌లు వేసుకోవడం జరుగుతూనే ఉంటుంది. అయితే, దేనికైనా ఓ హద్దు ఉంటుంది. సరదాలోనూ హుందాగా వ్యవహరించడం ముఖ్యం. లేదంటే ఇలా లక్నో సూపర్‌జెయింట్స్ అడ్మిన్లా మాటలు పడాల్సి వస్తుంది. ఐపీఎల్ కొత్త జట్టు లక్నో, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మంగళవారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా సాగిన ఈ మ్యాచ్‌కు ముందు తమ తుది జట్టును ప్రకటించిన లక్నో.. మీ వల్ల కాదు.. బేటా అంటూ తీవ్ర పదజాలం వాడుతూ ట్వీట్ చేసింది. ఈ విషయంపై స్పందించిన టీమిండియా మాజీ క్రికెటర్, కర్ణాటక ఫాస్ట్ బౌలర్ దొడ్డ గణేష్.. లక్నో ఫ్రాంఛైజీ తీరుపై మండిపడ్డాడు. ‘‘క్రికెట్లో సరదా సంభాషణలకు ఎల్లప్పుడూ చోటు ఉంటుంది. కానీ ఐపీఎల్లో అడుగుపెట్టిన కొత్త జట్టు.. 2008 నుంచి లీగ్‌లో ఆడుతున్న జట్టును ఉద్దేశించి బేటా అని సంబోధించడం సరికాదు. సవరణ చేయండి’’ అంటూ హితవు పలికాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో లక్నోపై గెలుపొందిన సంగతి తెలిసిందే. మరి గెలిచిన జట్టు తమపై సెటైర్ వేసిన లక్నోకు కౌంటర్ ఇవ్వకుండా ఉంటుందా! మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ అన్నట్లుగా.. బిగ్గెస్ట్ హిట్ కేజీఎఫ్ సినిమాలోని.. ‘‘ఇఫ్ యూ థింక్ యూ ఆర్ బ్యాడ్.. ఐయామ్ యువర్ డాడ్’’ అంటూ మాస్ డైలాగ్‌కు సంబంధించిన క్లిప్ షేర్ చేసింది. ఇందుకు స్పందనగా ఆర్సీబీ ఫ్యాన్స్.. ‘‘మాస్ అన్నా.. సూపర్‌గా కౌంటర్ ఇచ్చావు. ఈసారి కప్ మనదే చూడండి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా బేటా ట్వీట్‌పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో లక్నో.. సదరు పోస్టును డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. చదవదండి: IPL 2022-KL Rahul: ఐపీఎల్ నిబంధన ఉల్లంఘన.. కేఎల్ రాహుల్‌కు భారీ జరిమానా 😎#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #LSGvRCB https://t.co/uKkRa0GWIp pic.twitter.com/9jySu0HBdL — Royal Challengers Bangalore (@RCBTweets) April 19, 2022 Friendly banters are always welcome in cricket. But trolling is not done. A new team calling a team which’s been part of IPL since 2008, Beta, is not banter. Kindly make amends, @LucknowIPL #DoddaMathu #RCB #LSG #CricketTwitter https://t.co/Cw8LUZtAy0 — ದೊಡ್ಡ ಗಣೇಶ್ | Dodda Ganesh (@doddaganesha) April 19, 2022 That's that from Match 31.@RCBTweets win by 18 runs against #LSG. Scorecard - https://t.co/9Dwu1D2Lxc #LSGvRCB #TATAIPL pic.twitter.com/oSxJ4fAukI — IndianPremierLeague (@IPL) April 19, 2022 -
నాది కూడా అభినవ్ వర్ణ వివక్ష స్టోరీనే
బెంగళూరు: మళ్లీ జాతి వివక్ష అంశం తీవ్రమైంది. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని శ్వేత జాతి పోలీస్ అధికారి విచక్షణారహితంగా చంపిన నేపథ్యంలో ఆ దేశంలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. దీనిపై ఇప్పటికే పలువురు క్రీడా దిగ్గజాలు విరుచుకుపడుతుండగా, గతంలో ఎవరైతే ఇలా వర్ణ వివక్షకు గురయ్యారో వారు ముందుకొస్తున్నారు. ఈ కోవలో భారత మాజీ క్రికెటర్ దొడ్డా గణేశ్‌తో పాటు తమిళనాడుకు చెందిన టాపార్డర్ బ్యాట్స్‌మన్ అభివన్ ముకుంద్‌లు ఉన్నారు. దీనిపై ముందుగా అభినవ్ ముకుంద్ తన స్వరం వినిపించగా, అందుకు దొడ్డా గణేశ్ మద్దతుగా నిలిచాడు.(‘గుండెలపై చేయి వేసుకొని చెప్పగలరా?’) ‘నేను జాతి వివక్ష బారిన పడ్డా. కొంతమంది నన్ను టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో నాపై విమర్శలు చేశారు. నా వర్ణాన్ని కించపరుస్తూ అవహేళన చేశారు. వారిని నియంత్రణలో పెట్టడం అనేది మన చేతుల్లో ఉండదు. మనిషి రంగును బట్టి గుణం ఉండదు. అది అందానికి సంబంధించినది కాదు. ఎవరైతే ఇలా వివక్షకు గురయ్యారో వారంతా వారి వారి అనుభవాల్ని షేర్ చేసుకుంటే మంచిది’ అని తెలిపాడు. కాగా, ఆ సమయంలో ఎందుకు మాట్లాడలేదని ముకుంద్‌ను జర్నలిస్టు ప్రశ్నించగా, అది సరైన సమయం కాదనే తాను మాట్లాడలేదన్నాడు. 2017 శ్రీలంకతో వారి దేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్ మధ్యలో ఉండగా ఆ ఘటన జరిగింది. దాంతో నేనేమీ మాట్లాడలేదు’ అని ముకుంద్ పేర్కొన్నాడు. ఈ మేరకు తన ట్వీటర్ అకౌంట్ ఒక లేఖను సైతం అభినవ్ పోస్ట్ చేశాడు. తాను క్రికెటర్‌గా చాలా చోట్లకు తిరుగుతూ ఉండేవాడినని, ఈ క్రమంలోనే కొన్ని సందర్భాల్లో వర్ణ వివక్షకు గురైన విషయాన్ని తెలిపాడు. మనలోని స్వచ్ఛత అనేది రంగును బట్టి ఏమీ ఉండదనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ తెలుసుకుంటే మంచిదనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ విషయాన్ని చెబుతున్నానన్నాడు. ఇకనైనా ఇలా వివక్ష వ్యాఖ్యలు చేసేవారి మైండ్ సెట్ మారుతుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. (రవిశాస్త్రి పోస్ట్‌కు రణ్వీర్ రిప్లై) నాది కూడా అభినవ్ స్టోరీనే అభివన్ ముకుంద్ పోస్ట్ చేసిన లేఖపై కర్ణాటకకు చెందిన భారత మాజీ పేసర్ దొడ్డా గణేశ్ స్పందించాడు. తాను కూడా అభినవ్ తరహాలోనే వర్ణ వివక్షకు గురైనట్లు తెలిపాడు. ‘అభినవ్ స్టోరీ నాకు ఎదురైన అనుభవాన్ని గుర్తు చేసింది. నేను భారత్‌కు ఆడుతున్న సమయంలో ఎక్కువగా వర్ణ వివక్షకు గురయ్యా. దానికి ఒక భారత లెజండరీ క్రికెటరే సాక్ష్యం. ఇలా విమర్శించడం నన్ను ధృఢంగా చేసింది అలాగే దేశానికి ఆడటాన్ని కూడా దూరం చేయలేదు. నిజాయితీగా చెప్పాలంటే 90వ దశకంలో వర్ణ వివక్ష సీరియస్‌నెస్ గురించి నాకు పెద్దగా తెలియదు. అప్పుడు మనం ఏమైనా చెప్పుకోవడానికి ఇప్పుడున్నట్లు సోషల్ మీడియా లేదు. భవిష్యత్తులో ఏ భారత క్రికెటర్ ఇలా వర్ణ వివక్షకు గురి కాడనే ఆశిస్తున్నా’ అని దొడ్డా గణేశ్ తెలిపాడు. భారత్ తరఫున నాలుగు టెస్టులు, ఒక వన్డే మ్యాచ్‌ను గణేశ్ ఆడాడు. ఇక రంజీ ట్రోఫీ విషయానికొస్తే కర్ణాటక తరఫున 100పైగా మ్యాచ్‌లు ఆడిన గణేశ్.. 365 వికెట్లు సాధించాడు. 2007లో తన అంతర్జాతీయ కెరీర్‌కు గణేశ్ వీడ్కోలు చెప్పాడు. This story of @mukundabhinav, reminded me of the racial jibes I went through in my playing days. Only an Indian legend was witness to it. It only made me strong & didn’t deter me from playing for Ind & ovr 100 mts for Karnataka @StarSportsKan ಕಪ್ಪಗಿರೋರು ಮನುಷ್ಯರೇ. ಮೊದಲು ಮಾನವರಾಗಿ. pic.twitter.com/ZV8c8YPmpM— ದೊಡ್ಡ ಗಣೇಶ್ | Dodda Ganesh (@doddaganesha) June 3, 2020