IPL 2022: LSG Tweet To RCB Before Start Match, RCB Savage Response Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2022 RCB Vs LSG: మీ వల్ల కాదన్న లక్నో.. అదిరిపోయే కౌంటర్‌ వేసిన ఆర్సీబీ!

Published Wed, Apr 20 2022 2:12 PM | Last Updated on Wed, Apr 20 2022 4:05 PM

IPL 2022: RCB Savage Response to LSG Tumse Na Ho Payega Tweet - Sakshi

IPL 2022 RCB Vs LSG: ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు సోషల్‌ మీడియా వేదికగా పరస్పరం ట్రోల్‌ చేసుకోవడం సహజమే. ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ ఉన్న సందర్భంలో గెలుపోటముల గురించి అంచనా వేస్తూ సరదాగా పంచ్‌లు వేసుకోవడం జరుగుతూనే ఉంటుంది. అయితే, దేనికైనా ఓ హద్దు ఉంటుంది. సరదాలోనూ హుందాగా వ్యవహరించడం ముఖ్యం. లేదంటే ఇలా లక్నో సూపర్‌జెయింట్స్‌ అడ్మిన్‌లా మాటలు పడాల్సి వస్తుంది.

ఐపీఎల్‌ కొత్త జట్టు లక్నో, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మంగళవారం మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా సాగిన ఈ మ్యాచ్‌కు ముందు తమ తుది జట్టును ప్రకటించిన లక్నో.. మీ వల్ల కాదు.. బేటా అంటూ తీవ్ర పదజాలం వాడుతూ ట్వీట్‌ చేసింది. 

ఈ విషయంపై స్పందించిన టీమిండియా మాజీ క్రికెటర్‌, కర్ణాటక ఫాస్ట్‌ బౌలర్‌ దొడ్డ గణేష్‌.. లక్నో ఫ్రాంఛైజీ తీరుపై మండిపడ్డాడు. ‘‘క్రికెట్‌లో సరదా సంభాషణలకు ఎల్లప్పుడూ చోటు ఉంటుంది. కానీ ఐపీఎల్‌లో అడుగుపెట్టిన కొత్త జట్టు.. 2008 నుంచి లీగ్‌లో ఆడుతున్న జట్టును ఉద్దేశించి బేటా అని సంబోధించడం సరికాదు. సవరణ చేయండి’’ అంటూ హితవు పలికాడు.

ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో లక్నోపై గెలుపొందిన సంగతి తెలిసిందే. మరి గెలిచిన జట్టు తమపై సెటైర్‌ వేసిన లక్నోకు కౌంటర్‌ ఇవ్వకుండా ఉంటుందా! మాటల్లేవ్‌ మాట్లాడుకోవడాల్లేవ్‌ అన్నట్లుగా.. బిగ్గెస్ట్‌ హిట్‌ కేజీఎఫ్‌ సినిమాలోని.. ‘‘ఇఫ్‌ యూ థింక్‌ యూ ఆర్‌ బ్యాడ్‌.. ఐయామ్‌ యువర్‌ డాడ్‌’’ అంటూ మాస్‌ డైలాగ్‌కు సంబంధించిన క్లిప్‌ షేర్‌ చేసింది.

ఇందుకు స్పందనగా ఆర్సీబీ ఫ్యాన్స్‌.. ‘‘మాస్‌ అన్నా.. సూపర్‌గా కౌంటర్‌ ఇచ్చావు. ఈసారి కప్‌ మనదే చూడండి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా బేటా ట్వీట్‌పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో లక్నో.. సదరు పోస్టును డిలీట్‌ చేసినట్లు తెలుస్తోంది.

చదవదండి: IPL 2022-KL Rahul: ఐపీఎల్‌ నిబంధన ఉల్లంఘన.. కేఎల్‌ రాహుల్‌కు భారీ జరిమానా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement