సన్‌రైజర్స్ సైన్యం (PC: BCCI/IPL)
IPL 2024- SRH: ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ! ఆ జట్టు బౌలింగ్ కోచ్, సౌతాఫ్రికా స్టన్‌గన్ డేల్ స్టెయిన్ తాజా ఎడిషన్‌కు దూరం కానున్నట్లు సమాచారం.
వ్యక్తిగత కారణాల దృష్ట్యా తాను కొంతకాలం విరామం తీసుకోవాలని భావిస్తున్నట్లు స్టెయిన్ ఇప్పటికే ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యానికి చెప్పినట్లు తెలుస్తోంది. తాజా సీజన్ మొత్తానికి దూరంగా ఉండాలని అతడు నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అన్నీ సజావుగా సాగితే
‘‘సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది బౌలింగ్ కోచ్‌గా డేల్ స్టెయిన్ సేవలను కోల్పోనుంది. 2024 సీజన్‌కు అతడు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అన్నీ సజావుగా సాగితే వచ్చే ఏడాది అతడు మళ్లీ ఎస్‌ఆర్‌హెచ్ కోచింగ్ సిబ్బందిలో ఒకడిగా చేరతాడు’’ అని క్రిక్‌బజ్ తన కథనంలో పేర్కొంది.
కాగా 40 ఏళ్ల డేల్ స్టెయిన్ సౌతాఫ్రికా స్టార్ పేసర్‌గా పేరొందాడు. ప్రొటిస్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 439, 196, 64 వికెట్లు తీశాడు. గతంలో సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు గతేడాది అదే జట్టుకు ఫాస్ట్‌బౌలింగ్ కోచ్‌గానూ సేవలు అందించాడు.
ఇదిలా ఉంటే.. గత రెండు సీజన్లుగా చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో పదో స్థానం కోసం పోటీపడిన సన్‌రైజర్స్.. ఈసారి హెడ్‌కోచ్‌ను మార్చింది. బ్రియన్ లారా స్థానంలో డేనియల్ వెటోరీని తీసుకువచ్చింది.
అయితే, స్టెయిన్ విషయంలో యాజమాన్యం నిర్ణయం తీసుకుందా.. లేదంటే అతడే బ్రేక్ తీసుకోవాలని భావించాడా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే!
ఐపీఎల్-2024 ఎస్‌ఆర్‌హెచ్ జట్టు
అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), మార్కో జాన్సన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి.నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీశ్ కుమార్ రెడ్డి, ఫజల్హక్ ఫారూఖీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగ, పాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్కత్, ఆకాశ్ సింగ్, జాతవేద్ సుబ్రమణ్యన్.
చదవండి: IPL 2024: సన్‌రైజర్స్ ఆడే మ్యాచ్‌లు ఇవే.. హైదరాబాద్‌లో రెండు మ్యాచ్‌లు
అతడు తప్పు చేయలేదు.. అలాంటపుడు శిక్ష ఎందుకు?
Comments
Please login to add a commentAdd a comment