IPL 2024: సన్‌రైజర్స్‌ కొత్త బౌలింగ్‌ కోచ్‌ అతడే.. కోచింగ్‌ సిబ్బంది పూర్తి వివరాలు | IPL 2024: James Franklin Replaces Dale Steyn As Sunrisers Hyderabad Pace Bowling Coach - Sakshi
Sakshi News home page

IPL 2024: సన్‌రైజర్స్‌ కొత్త బౌలింగ్‌ కోచ్‌ అతడే.. కోచింగ్‌ సిబ్బంది పూర్తి వివరాలు

Published Mon, Mar 4 2024 4:54 PM | Last Updated on Mon, Mar 4 2024 5:16 PM

James Franklin Replaces Dale Steyn As Bowling Coach For SRH In IPL 2024 - Sakshi

రానున్న ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా న్యూజిలాండ్‌ మాజీ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ జేమ్స్‌ ఫ్రాంక్లిన్‌ వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న డేల్‌ స్టెయిన్‌ వ్యక్తిగత కారణాల చేత 2024 సీజన్‌ మొత్తానికి దూరంగా ఉండనుండటంతో ఎన్‌ఆర్‌హెచ్‌ మేనేజ్‌మెంట్‌ ఫ్రాంక్లిన్‌ను ఎంపిక చేసింది. అయితే ఫ్రాంక్లిన్‌ ఈ విధుల్లో తాత్కాలికంగా మాత్రమే కొనసాగనున్నాడు. స్టెయిన్‌ తిరిగి రాగానే ఫ్రాంక్లిన్‌ ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటాడు. స్టెయిన్‌ 2022లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. 

ఫ్రాంక్లిన్‌ ట్రాక్‌ రికార్డు విషయానికొస్తే.. బౌలింగ్‌ కోచ్‌గా ఇవే అతనికి తొలి బాధ్యతలు. గతంలో అతను డర్హమ్‌ కౌంటీ జట్టుకు, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరించాడు. ఫ్రాంక్లిన్‌కు బౌలింగ్‌ కోచ్‌గా అనుభవం లేనప్పటికీ.. అతను ఐపీఎల్‌కు సుపరిచితుడే. 2011, 2012 సీజన్లలో అతను ఆటగాడిగా ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 

ఫ్రాంక్లిన్‌.. సన్‌రైజర్స్‌ హెడ్‌ కోచ్‌ డేనియల్‌ వెటోరీకి రిపోర్ట్‌ చేయనున్నాడు. వెటోరీ కూడా న్యూజిలాండ్‌ దేశస్తుడే. ఎస్‌ఆర్‌హెచ్‌ హెడ్‌ కోచ్‌గా వెటోరీకి కూడా ఇవే తొలి బాధ్యతలు. గత ఐపీఎల్‌ సీజన్‌ ముగిసిన అనంతరం వెటోరీ సన్‌రైజర్స్‌ హెడ్‌ కోచ్‌గా నియమించబడ్డాడు. వెటోరీ, ఫ్రాంక్లిన్‌ గతంలో మిడిల్‌సెక్స్‌ కౌంటీకి, హండ్రెడ్‌ లీగ్‌లో బర్మింగ్హమ్‌ ఫీనిక్స్‌కు కలిసి పని చేశారు.

ఫ్రాంక్లిన్‌ కెరీర్‌ విషయానికొస్తే.. ఇతను 2001-2013 మధ్యలో న్యూజిలాండ్‌ తరఫున 31  టెస్ట్‌లు, 110 వవ్డేలు, 38 టీ20లు ఆడి 183 వికెట్లు సాధించాడు. ఫ్రాంక్లిన్‌ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున 20 మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు.  కాగా, ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం ఇవాళ ఉదయమే కొత్త కెప్టెన్‌గా పాట్‌ కమిన్స్‌ పేరును ప్రకటించింది. మార్క్రమ్‌ నుంచి కమిన్స్‌ బాధ్యతలు చేపడతాడు. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కోచింగ్‌ స్టాఫ్‌ వివరాలు..

  • హెడ్‌ కోచ్‌: డేనియల్‌ వెటోరీ
  • బ్యాటింగ్‌ కోచ్‌: హేమంగ్‌ బదానీ
  • స్పిన్‌ బౌలింగ్‌ మరియు స్ట్రాటజిక్‌ కోచ్‌: ముత్తయ్య మురళీథరన్‌
  • ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌: జేమ్స్‌ ఫ్రాంక్లిన్‌ (తాత్కాలికం)
  • అసిస్టెంట్‌ కోచ్‌: సైమన్‌ హెల్మట్‌
  • ఫీల్డింగ్‌ కోచ్‌: ర్యాన్‌ కుక్‌

సన్‌రైజర్స్‌ జట్టు వివరాలు..

  1. అబ్దుల్ సమద్ బ్యాటర్ 4 కోట్లు
  2. రాహుల్ త్రిపాఠి బ్యాటర్ 8.5 కోట్లు
  3. ఎయిడెన్ మార్క్రమ్ బ్యాటర్ 2.6 కోట్లు 
  4. గ్లెన్ ఫిలిప్స్ బ్యాటర్ 1.5 కోట్లు
  5. హెన్రిచ్ క్లాసెన్ బ్యాటర్ 5.25 కోట్లు
  6. మయాంక్ అగర్వాల్ బ్యాటర్ 8.25 కోట్లు
  7. ట్రావిస్ హెడ్ బ్యాటర్ 6.8 కోట్లు
  8. అన్మోల్‌ప్రీత్ సింగ్ బ్యాటర్ 20 లక్షలు
  9. ఉపేంద్ర యాదవ్ వికెట్ కీపర్ 25 లక్షలు
  10. షాబాజ్ అహ్మద్ ఆల్ రౌండర్ 2.4 కోట్లు
  11. నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ 20 లక్షలు
  12. అభిషేక్ శర్మ ఆల్ రౌండర్ 6.5 కోట్లు
  13. మార్కో జాన్సెన్ ఆల్ రౌండర్ 4.2 కోట్లు
  14. వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ 8.75 కోట్లు
  15. సన్వీర్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు
  16. పాట్ కమిన్స్ బౌలర్ 20.5 కోట్లు (కెప్టెన్‌)
  17. భువనేశ్వర్ కుమార్ బౌలర్ 4.2 కోట్లు
  18. టి నటరాజన్ బౌలర్ 4 కోట్లు
  19. వనిందు హసరంగా బౌలర్ 1.5 కోట్లు
  20. మయాంక్ మార్కండే బౌలర్ 50 లక్షలు
  21. ఉమ్రాన్ మాలిక్ బౌలర్ 4 కోట్లు
  22. ఫజల్హాక్ ఫరూకీ బౌలర్ 50 లక్షలు
  23. జయదేవ్ ఉనద్కత్ బౌలర్ 1.6 కోట్లు
  24. ఆకాశ్ సింగ్ బౌలర్ 20 లక్షలు
  25. ఝటావేద్ సుబ్రమణ్యం బౌలర్ 20 లక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement