డానియల్ వెటోరి
సెయింట్ మోరిట్జ్(స్విట్జర్లాండ్):ప్రస్తుతం భారత క్రికెట్‌లో తన స్పిన్ మంత్రంతో దూసుకపోతున్న యజ్వేంద్ర చాహల్ పూర్తిస్థాయిలో రూపాంతరం చెందడానికి కెప్టెన్ విరాట్ కోహ్లి కృషి ఎంతో ఉందని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెటోరి స్పష్టం చేశాడు. ప్రధానంగా పరిమిత ఓవర్ల క్రికెట్ చాహల్ తనదైన ముద్రవేయడానికి కారణం కోహ్లి అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.
'ప్రస్తుతం చాహల్ ఒక ధైర్యవంతమైన బౌలర్ మాత్రమే కాదు.. నమ్మశక్యమైన బౌలర్ కూడా. ఐపీఎల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం వల్లే చాహల్ రాటుదేలాడు. చిన్నస్వామి స్టేడియం తరహా చిన్న స్టేడియాల్లో బౌలింగ్ చేయడం చాహల్‌కు బాగా కలిసొచ్చింది. దీని వెనుక విరాట్ కృష్టి ఎంతో ఉంది. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ఆడేటప్పుడు అతనికి కోహ్లి ధైర్యంగా బౌలింగ్ అప్పచెప్పడమే కాకుండా ముందుండి నడిపించేవాడు. దాంతో చాహల్‌లో ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడమే కాకుండా ఒక ఎటాకింగ్ బౌలర్‌గా రూపాంతరం చెందాడు. ఈ రోజు మ్యాచ్ విన్నింగ్ బౌలర్‌గా చాహల్ గుర్తింపు సాధించడానికి కోహ్లినే కారణం' అని వెటోరి పేర్కొన్నాడు. ఐపీఎల్లో ఆర్సీబీకి కోచ్‌గా వ్యవహరించడం గొప్ప అనుభూతిగా తెలిపిన వెటోరి.. కోహ్లి సారథ్యంలో జట్టు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించడం చాలా సంతోషంగా ఉందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment