Yuzvendra Chahal Shares Emotional Post On Virat Kohli And His Captaincy - Sakshi
Sakshi News home page

Ind Vs Sa ODIs: కోహ్లి భయ్యా.. నేనెవరి వికెట్‌ తీయాలో చెప్పవా?: చహల్‌ భావోద్వేగం

Jan 19 2022 10:49 AM | Updated on Jan 19 2022 11:45 AM

Yuzvendra Chahal Emotional Note For Virat Kohli Kiska Wicket Lu Bhaiya - Sakshi

PC: Chahal

నువ్వు నా కెప్టెన్‌.. చహల్‌ భావోద్వేగం.. నేనెవరి వికెట్‌ తీయాలి భయ్యా!

Yuzvendra Chahal Emotional Note For Virat Kohli Viral: ‘‘ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలు... పరస్పర నమ్మకం.. అవగాహనతో ముందుకు వెళ్లడం నిజంగా గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఇందుకు నేనెంతో సంతోషిస్తున్నా. ఇలాగే మరిన్ని మ్యాచ్‌లలోనూ మనం కలిసి ముందుకు సాగాలి. అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలి. విజయవంతమైన కెప్టెన్‌గా ఏడేళ్లు నడిపించిన నీకు ధన్యవాదాలు. అవును... భయ్యా నేను ఎవరి వికెట్‌ తీయాలో చెప్పవా?’’ అంటూ టీమిండియా బౌలర్‌ యజువేంద్ర చహల్‌.. విరాట్‌ కోహ్లిని ఉద్దేశించి ఉద్వేగపూరిత నోట్‌ షేర్‌ చేశాడు. 

కాగా టీమిండియా మాజీ కెప్టెన్‌, రాయల్‌ బెంగళూరు ఫ్రాంఛైజీ ఒకప్పటి సారథి కోహ్లితో చహల్‌కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్‌ తొలి నాళ్ల నుంచి కింగ్‌ కెప్టెన్‌ అతడిని ప్రోత్సహించాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ చహల్‌పై నమ్మకం ఉంచి మెరుగైన ఫలితాలు అందుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ ఓటమి తర్వాత సంప్రదాయ క్రికెట్‌ కెప్టెన్సీకి కోహ్లి గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే. 

ఇప్పటికే పరిమిత ఓవర్ల సారథ్య బాధ్యతలు కూడా చేతులు మారాయి. ఈ నేపథ్యంలో కోహ్లితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చహల్‌ ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఫొటో షేర్‌ చేశాడు. ఇందులో కోహ్లి అతడికి ఏవో సూచనలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ నేపథ్యంలో కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలో చహల్‌తో కలిసి కోహ్లి ఓ సభ్యుడిగా మాత్రమే మొదటి వన్డే ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో చహల్‌ ఈ ఫొటో షేర్‌ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతోంది. ఇక జనవరి 19 నుంచి ప్రొటిస్‌తో టీమిండియా వన్డే సిరీస్‌ ఆరంభమవుతోంది.

చదవండి: Virat Kohli: నువ్వు నా పెద్దన్నవు.. ఎల్లప్పుడూ కెప్టెన్‌ కింగ్‌ కోహ్లివే
Ind Vs Sa 1st ODI: ధావన్‌కు షాక్‌... ఓపెనర్‌గా వెంకటేశ్‌ అయ్యర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement