వార్నర్ రికార్డు సెంచరీ
సిడ్నీ: ఆస్ట్రేలియా జట్టులో స్థానం కోల్పోయిన డేవిడ్ వార్నర్ తమ దేశవాళీ వన్డే టోర్నీ ర్యోబి కప్‌లో చెలరేగాడు. న్యూసౌత్‌వేల్స్ జట్టు తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన వార్నర్ (141 బంతుల్లో 197; 20 ఫోర్లు, 10 సిక్స్‌లు) ఆసీస్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
గతంలో ఈ రికార్డు జిమ్మీ మహెర్ (187) పేరిట ఉంది. వార్నర్ దూకుడుతో న్యూసౌత్‌వేల్స్ 4 వికెట్ల తేడాతో విక్టోరియాను ఓడించి ర్యోబి కప్ ఫైనల్లోకి ప్రవేశించింది. క్రిస్టియాన్ (117) సెంచరీ సహాయంతో విక్టోరియా 321 పరుగులు చేసినా... న్యూసౌత్‌వేల్స్ లక్ష్యాన్ని ఛేదించింది.