అగ్నిప్రమాదం నుంచి బయటపడ్డ ఆస్ట్రేలియా టీం | Australian team evacuated in Olympic village fire scare | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదం నుంచి బయటపడ్డ ఆస్ట్రేలియా టీం

Published Sat, Jul 30 2016 8:36 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

అగ్నిప్రమాదం నుంచి బయటపడ్డ ఆస్ట్రేలియా టీం - Sakshi

అగ్నిప్రమాదం నుంచి బయటపడ్డ ఆస్ట్రేలియా టీం

రియో డీ జెనీరో: ఒలంపిక్స్లో పాల్గొనేందుకు బ్రెజిల్ చేరుకున్న ఆస్ట్రేలియా అథ్లెట్ల బృందం అగ్నిప్రమాదం నుంచి బయటపడింది. రియో 2016 ఒలంపిక్ విలేజ్లో అస్ట్రేలియా అథ్లెట్లు ఉన్న అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా అపార్ట్మెంట్లో పొగలు వ్యాపించడంతో.. అథ్లెట్లను అధికారులు అక్కడి నుంచి ఖాళీ చేయించారని ఆస్ట్రేలియా జట్టు స్పోక్స్ పర్సన్ మైక్ టాంక్రెడ్ వెల్లడించారు. ఫైర్ అలారం మోగటంతో ఆటగాళ్లను అపార్ట్మెంట్ నుంచి బయటకు పంపినట్లు జిన్హువా మీడియా సంస్థ తెలిపింది.

అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం ఆటగాళ్లు తిరిగి అపార్ట్మెంట్లోకి వెళ్లారు. బిల్డింగ్ బేస్మేట్ ప్రాంతంలో మంటలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement