ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో లంకపై ఆసీస్‌ విజయం | Aussie win over Lanka in the practice match | Sakshi
Sakshi News home page

ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో లంకపై ఆసీస్‌ విజయం

Published Sat, May 27 2017 12:14 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM

Aussie win over Lanka in the practice match

ఓవల్‌: చాంపియన్స్‌ ట్రోఫీ సన్నాహాల్లో భాగంగా శ్రీలంక జట్టుతో శుక్రవారం జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్లకు 318 పరుగులు చేసింది. మాథ్యూస్‌ (95), గుణరత్నె (70 నాటౌట్‌) అర్ధ సెంచరీలు చేశారు.

అనంతరం ఆస్ట్రేలియా 49.4 ఓవర్లలో 8 వికెట్లకు 319 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ ఆరన్‌ ఫించ్‌ (109 బంతుల్లో 137; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీ చేయగా... ట్రావిస్‌ హెడ్‌ (85 నాటౌట్‌) అజేయంగా నిలిచి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement