డెర్బీషైర్ 326/5
డెర్బీ: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత బౌలింగ్ బలగానికి ఇంకా పట్టు చిక్కడం లేదు. ఫలితంగా మంగళవారం ప్రారంభమైన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి డెర్బీషైర్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది.
డర్స్‌టన్ (95), గాడెల్‌మాన్ (67), స్లేటర్ (54), హొసీన్ (53 నాటౌట్) అర్ధ సెంచరీలు చేశారు. టీమిండియా బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో మరోసారి విఫలమయ్యారు. ముఖ్యంగా ఇంగ్లండ్ గడ్డపై ఆడిన అనుభవం ఉన్న ప్రధాన పేసర్ ఇషాంత్ శర్మ వైఫల్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గత మ్యాచ్‌లో 7 నోబాల్స్ వేసిన ఇషాంత్... ఈ సారి కూడా భారీగా పరుగులిచ్చి 9 నోబాల్స్ వేయడం చూస్తే అతని బౌలింగ్ గతి తప్పిందని అర్థమవుతోంది. అయితే రవీంద్ర జడేజా 2 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ పొదుపుగా బౌలింగ్ చేశాడు.
భారత బౌలర్లు మళ్లీ విఫలం
Published Wed, Jul 2 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM
Advertisement
Advertisement