
కొలంబో: గాయం కారణంగా సుదీర్ఘ కాలం జట్టుకు దూరమై గత నెల్లో భారత్ తో జరిగిన సిరీస్ ద్వారా పునరాగమనం చేసిన శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగాపై తాజాగా వేటు పడింది. టీమిండియాతో సిరీస్ లో ఏ మాత్రం ఆకట్టుకోని మలింగాకు ఉద్వాసన పలుకుతూ శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. దాంతో త్వరలో యూఏఈలో పాకిస్తాన్ తో జరిగే ఐదు వన్డేల సిరీస్ లో అతన్ని దూరం పెట్టారు. మరొకవైపు ప్రస్తుత పాక్ తో టెస్టు సిరీస్ లో గాయం కారణంగా జట్టుకు దూరమైన మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ ను కూడా వన్డేలకు ఎంపిక చేయలేదు. అతను ఇంకా గాయం నుంచి కోలుకోలేకపోవడంతో విశ్రాంతినిచ్చారు. మాథ్యూస్ ఇంకా కుడి పిక్క గాయం నుంచి తేరుకోలేదని శ్రీలంక క్రికెట్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు 15 మంది కూడిన వన్డే జట్టును ప్రకటించారు.
శ్రీలంక జట్టు: ఉపుల్ తరంగా(కెప్టెన్), దినేశ్ చండిమాల్, నిరోషాన్ డిక్ వెల్లా, లహిరు తిరుమన్నే, కుశాల్ మెండిస్, మిలిందా సిరివర్ధనే, చమర కపుగదెరా, తిషారా పెరీరా, సీక్కుజ్ ప్రసన్న, నువాన్ ప్రదీప్, సురంగా లక్మల్, దుస్మంత చమీరా, విశ్వ ఫెర్నెండో, అకిలా దనంజయ, జెఫ్రీ వాండ్రాసె