
కొలంబో: సుదీర్ఘ విరామం తర్వాత లసిత్ మలింగా మరొకసారి శ్రీలంక కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జనవరి3వ తేదీ నుంచి న్యూజిలాండ్‌తో జరుగనున్న పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్‌కు మలింగాను సారథిగా నియమిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 17 మందితో కూడిన జట్టును శ్రీలంక బోర్డు ప్రకటించింది. ప్రస్తుతం శ్రీలంక జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ అనంతరం మూడు వన్డేల సిరీస్‌తో పాటు ఏకైక టీ20 ఆడనుంది. 2014 టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంక జట్టుకు మలింగ నాయకత్వం వహించాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 2016లో మరోసారి శ్రీలంక జట్టు కెప్టెన్సీ పగ్గాలను అందుకున్నాడు.
ఆ తర్వాత గాయల కారణంగా మలింగకు జట్టులో చోటు దక్కడమే కష్టంగా మారింది. ఇటీవల మళ్లీ ఫిట్‌నెస్‌ను నిరూపించుకుని పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడుతున్న మలింగాను తిరిగి కెప్టెన్‌గా నియమించడం విశేషం. ప్రస్తుతం 35వ ఒడిలో ఉన్న మలింగా.. న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో జట్టును ఎంతవరకూ ముందుకు తీసుకెళతాడో చూడాలి.
శ్రీలంక జట్టు
లసిత్ మలింగ(కెప్టెన్), నిరోషాన్ డిక్వెల్లా (వైస్ కెప్టెన్), ఏంజెలో మ్యాథ్యూస్, ధనుష్క గుణతిలక, కుషాల్ జనితే పెరీరా, దినేశ్ చండిమాల్, ఆషేలా గుణరత్న, కుశాల్ మెండిస్, ధనుంజయ డిసెల్వా, తిషారా పెరీరా, దాసన్ షణక, లక్ష్మణ్ సందకన్, ప్రసన్న, ధుష్మంత ఛమీరా, కాసున్ రంజిత, నువాన్ ప్రదీప్, లాహిరు కుమార