
ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే శ్రీలంక పేసర్ లసిత్ మలింగ... దేశవాళీ వన్డే టోర్నీ సూపర్ ప్రొవిన్షియల్ టోర్నీలో ఆడాల్సిందేనంటూ పంతం పట్టిన శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) మనసు మార్చుకుంది. ఐపీఎల్‌లో ఆడేందుకు మలింగకు అనుమతినిచ్చింది.
ఈ మేరకు తన అధికారిక ట్వీటర్ పేర్కొంది. సూపర్ ప్రొవిన్షియల్ వన్డే టోర్నీలో ఆడటం కన్నా ప్రపంచ అగ్రశ్రేణి క్రికెటర్లు పాల్గొనే ఐపీఎల్‌లో ఆడితే మలింగకు ఉపకరిస్తుందని బోర్డు ప్రకటించింది. మరోవైపు బీసీసీఐ జోక్యంతోనే శ్రీలంక బోర్డు తన మనసు మార్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment