శ్రీలంక కెప్టెన్గా మలింగా | Lasith Malinga To Lead Defending Champions Sri Lanka in Asia Cup and World Twenty20, | Sakshi
Sakshi News home page

శ్రీలంక కెప్టెన్గా మలింగా

Published Thu, Feb 18 2016 4:51 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

శ్రీలంక కెప్టెన్గా మలింగా - Sakshi

శ్రీలంక కెప్టెన్గా మలింగా

వచ్చే నెలలో భారత్లో జరిగే వరల్డ్ టీ 20లోడిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగే శ్రీలంక క్రికెట్ జట్టుకు లషిత్ మలింగా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.

కొలంబో: వచ్చే నెలలో భారత్లో జరిగే వరల్డ్ టీ 20లోడిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగే శ్రీలంక క్రికెట్ జట్టుకు లషిత్ మలింగా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ సెలక్షన్ కమిటీ ఆసియా కప్ తో పాటు, వరల్డ్ ట్వంటీ 20 జట్టును తాజాగా ప్రకటించింది. ఈ రెండు టోర్నీలకు మలింగానే కెప్టెన్ గా ఉండనున్నాడు.

 

గత కొంతకాలంగా గాయంతో జట్టుకు దూరమైన మలింగా.. ప్రధాన సిరీస్లైన న్యూజిలాండ్ సిరీస్ తో పాటు భారత్ పర్యటనలో పాల్గొనలేదు. కాగా,  గాయం నుంచి పూర్తిగా కోలుకున్న మలింగా ఫిట్ నెస్ ను నిరూపించుకోవడంతో జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. మలింగాతో పాటు నువాన్ కులశేఖర, రంగనా హెరాత్లు కూడా జట్టులో స్థానం సంపాదించారు.

శ్రీలంక వరల్డ్ ట్వంటీ 20 జట్టు ఇదే; లషిత్ మలింగా(కెప్టెన్), ఏంజిలో మాథ్యూస్(వైస్ కెప్టెన్), దినేష్ చండిమాల్, తిలకరత్న దిల్షాన్, నిరోషన్ డిక్వెల్, షెహన్ జయసూరియా, మిలిందా సిరివర్దనే, దాసున్ షనాకా, చమర కపుగెదరా, నువాన్ కులశేఖర, దుష్మంత్ చమీరా, తిషారా పెరీరా, సేననాయకే, రంగనా హెరెత్, జెఫ్రీ వాండర్సే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement