PC: IPL Twitter
రాజస్థాన్ బౌలర్ యుజ్వేంద్ర చహల్‌కు ఐపీఎల్-2023 సీజన్ చిరకాలం గుర్తుండి పోతుంది. ఈ సీజన్‌లో రికార్డులు బద్దలు కొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్న చహల్.. నిన్న (మే 11) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ అత్యుత్తమ రికార్డును తన పేరిట లిఖించుకోవడంతో పాటు పలు సాధారణ రికార్డులను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు.
నిన్నటి మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టిన చహల్.. క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక వికెట్లు (143 మ్యాచ్‌ల్లో 187 వికెట్లు) తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించడంతో పాటు ఈ సీజన్ టాప్ వికెట్ టేకర్‌గా (12 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు) తన ప్రస్థానాన్ని కొనసాగించనున్నాడు. ఈ క్రమంలో చహల్ మరో అన్ నోటీస్‌డ్ రికార్డును సైతం సమం చేశాడు.
తన ఐపీఎల్ గురువైన లసిత్ మలింగ పేరిట ఉండిన ఓ రికార్డును చహల్ సమం చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు (7) నాలుగు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మలింగ రెండో స్థానంలో ఉండగా.. నిన్నటి ప్రదర్శనతో చహల్ (7) గురువు సరసన చేరాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు నాలుగు వికెట్లు పడగొట్టిన రికార్డు కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ (8) పేరిట ఉంది.
ఈ సీజన్‌లో అన్ని అనుకూలిస్తే చహల్ మరో 5 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుంది. దీంతో చహల్ మరెన్ని రికార్డులు బద్దలు కొడతాడో వేచి చూడాలి. చహల్ ప్రస్తుత ఫామ్‌ను కొనసాగిస్తే, ఈ సీజన్‌లోనే ఎవరికీ సాధ్యం కాని 200 వికెట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. చహల్ (4/25) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగా.. యశస్వి (47 బంతుల్లో 98 నాటౌట్; 13 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (29 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) బీభత్సం సృష్టించడంతో రాజస్థాన్ 13.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
చదవండి: KKR VS RR: ఆ రికార్డును ఎవరూ పట్టించుకోలేదు.. కోహ్లి తర్వాత యశస్వి ఒక్కడే..!
Comments
Please login to add a commentAdd a comment