క్రికెట్‌: శ్రీలంకకు ఎదురుదెబ్బ! | Kapugedera ruled out of fourth ODI | Sakshi
Sakshi News home page

క్రికెట్‌: శ్రీలంకకు ఎదురుదెబ్బ!

Published Wed, Aug 30 2017 2:32 PM | Last Updated on Fri, Nov 9 2018 6:46 PM

క్రికెట్‌: శ్రీలంకకు ఎదురుదెబ్బ! - Sakshi

క్రికెట్‌: శ్రీలంకకు ఎదురుదెబ్బ!

సాక్షి, కొలంబో: ఇప్పటికే భారత్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో తొలి మూడు వన్డేలు ఓడిపోయి.. సిరీస్‌ను చేజార్చుకున్న శ్రీలంక జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక తాత్కాలిక కెప్టెన్‌ చామరా కపుగెదరా వెన్నుగాయం కారణంగా నాలుగో వన్డేకు దూరమయ్యారు. దీంతో నాలుగో వన్డేలో ఫాస్ట్‌ బౌలర్‌ లసిత్‌ మలింగా లంక జట్టుకు నాయకత్వం వహించనున్నారు.

వరుసగా రెండు వన్డేల్లోనూ స్లో ఓవర్‌రేట్‌ నమోదుకావడంతో శ్రీలంక కెప్టెన్‌ ఉపుల్‌ తరంగపై రెండు మ్యాచుల సస్పెన్షన్‌ విధించిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో మూడో వన్డేలో నాయకత్వం వహించిన కపుగెదరా మ్యాచ్‌ సందర్భంగా గాయపడ్డాడు. దీంతో వైద్య పరీక్షల అనంతరం మిగతా వన్డేల్లో అతను అందుబాటులో ఉండే పరిస్థితి లేదని లంక క్రికెట్‌ బోర్డు వెల్లడించింది.

ఇక రెండో వన్డేలో గాయపడిన లంక ఓపెనర్‌ ధనుష్క గుణతిలక మిగతా వన్డేలకు అందుబాటులో ఉండేది లేనిది ఇంకా స్పష్టం కాలేదు. అతను బుధవారం ఫిట్‌నెస్‌ టెస్టులకు హాజరుకాబోతున్నాడు. ఈ నేపథ్యంలో లంక జట్టులోకి ప్రత్యామ్నాయంగా ధనుంజయ డిసిల్వా, దిల్షాన్‌ మునవీరాలను తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement