Chamara Kapugedera
-
బంతి తగిలి విలవిల్లాడిపోయాడు!
అబుదాబి: క్రికెట్లో గాయాలు సహజం. కానీ కొన్ని గాయాలు ప్రాణానికే ప్రమాదం. ఈ విషయం క్రికెటర్లకు తెలిసినా ఒక్కోసారి తీవ్ర గాయాలు పాలుకావడం చూస్తునే ఉంటాం. గత రెండు రోజుల క్రితం పాకిస్తాన్ తో అబుదాబిలో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక ఆటగాడు చమర కపుగెదెరా ఇదే తరహాలో గాయపడ్డాడు. లంక వికెట్ కీపర్ నిరోషానక్ డిక్ వెల్లా చేసిన పొరపాటుకు కపుగెదెరా తీవ్రంగా గాయపడ్డాడు. ఓవర్ ముగిసిన తరువాత మరో ఆటగాడికి బంతిని విసిరే క్రమంలో కపుగెదెరా తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో అంపైర్ వైపుకు కపుగెదెరా నడుచుకుని వస్తుండగా డిక్ వెల్లా ఒక చిన్నపాటి సందేశంతో బంతిని విసిరాడు. ఆ విషయాన్ని చివరి నిమిషంలో గమనించిన కపుగెదెరా తప్పించుకునే యత్నం చేసినా అది అతని కంటి కింద భాగంపై తగిలింది. దాంతో విలవిల్లాడిపోయిన కపుగెదెరా కాసేపు అక్కడే మోకాళ్లపై కూలబడిపోయాడు. కాకపోతే ఎటువంటి ఫ్రాక్చర్ కాలేదని, కేవలం వాపు మాత్రమే వచ్చిందని శ్రీలంక క్రికెట్ జట్టు మేనేజర్ అశాంక గురుసిన్హా తెలిపారు. పాకిస్తాన్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 10 ఓవర్ ముగిసిన తరువాత చోటు చేసుకుంది. -
బంతి తగిలి విలవిల్లాడిపోయాడు!
-
క్రికెట్: శ్రీలంకకు ఎదురుదెబ్బ!
సాక్షి, కొలంబో: ఇప్పటికే భారత్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో తొలి మూడు వన్డేలు ఓడిపోయి.. సిరీస్‌ను చేజార్చుకున్న శ్రీలంక జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక తాత్కాలిక కెప్టెన్ చామరా కపుగెదరా వెన్నుగాయం కారణంగా నాలుగో వన్డేకు దూరమయ్యారు. దీంతో నాలుగో వన్డేలో ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగా లంక జట్టుకు నాయకత్వం వహించనున్నారు. వరుసగా రెండు వన్డేల్లోనూ స్లో ఓవర్‌రేట్ నమోదుకావడంతో శ్రీలంక కెప్టెన్ ఉపుల్ తరంగపై రెండు మ్యాచుల సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో మూడో వన్డేలో నాయకత్వం వహించిన కపుగెదరా మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. దీంతో వైద్య పరీక్షల అనంతరం మిగతా వన్డేల్లో అతను అందుబాటులో ఉండే పరిస్థితి లేదని లంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇక రెండో వన్డేలో గాయపడిన లంక ఓపెనర్ ధనుష్క గుణతిలక మిగతా వన్డేలకు అందుబాటులో ఉండేది లేనిది ఇంకా స్పష్టం కాలేదు. అతను బుధవారం ఫిట్నెస్ టెస్టులకు హాజరుకాబోతున్నాడు. ఈ నేపథ్యంలో లంక జట్టులోకి ప్రత్యామ్నాయంగా ధనుంజయ డిసిల్వా, దిల్షాన్ మునవీరాలను తీసుకున్నారు.