బంతి తగిలి విలవిల్లాడిపోయాడు! | Sri Lanka's Chamara Kapugedera suffers horrific injury | Sakshi
Sakshi News home page

బంతి తగిలి విలవిల్లాడిపోయాడు!

Published Fri, Oct 20 2017 1:11 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

Sri Lanka's Chamara Kapugedera suffers horrific injury - Sakshi

అబుదాబి: క్రికెట్‌లో గాయాలు సహజం. కానీ కొన్ని గాయాలు ప్రాణానికే ప్రమాదం. ఈ విషయం క్రికెటర్లకు తెలిసినా ఒక్కోసారి తీవ్ర గాయాలు పాలుకావడం చూస్తునే ఉంటాం. గత రెండు రోజుల క్రితం పాకిస్తాన్ తో అబుదాబిలో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక ఆటగాడు చమర కపుగెదెరా ఇదే తరహాలో గాయపడ్డాడు. లంక వికెట్ కీపర్ నిరోషానక్ డిక్ వెల్లా చేసిన పొరపాటుకు కపుగెదెరా తీవ్రంగా గాయపడ్డాడు. ఓవర్ ముగిసిన తరువాత మరో ఆటగాడికి బంతిని విసిరే క్రమంలో కపుగెదెరా తీవ్రంగా గాయపడ్డాడు.

ఆ సమయంలో అంపైర్ వైపుకు కపుగెదెరా నడుచుకుని వస్తుండగా డిక్ వెల్లా ఒక చిన్నపాటి సందేశంతో బంతిని విసిరాడు. ఆ విషయాన్ని చివరి నిమిషంలో గమనించిన కపుగెదెరా తప్పించుకునే యత్నం చేసినా అది అతని కంటి కింద భాగంపై తగిలింది. దాంతో విలవిల్లాడిపోయిన కపుగెదెరా కాసేపు అక్కడే మోకాళ్లపై కూలబడిపోయాడు. కాకపోతే ఎటువంటి ఫ్రాక్చర్ కాలేదని, కేవలం వాపు మాత్రమే వచ్చిందని శ్రీలంక క్రికెట్ జట్టు మేనేజర్ అశాంక గురుసిన్హా తెలిపారు. పాకిస్తాన్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 10 ఓవర్ ముగిసిన తరువాత చోటు చేసుకుంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement