
శ్రీలంక జట్టులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. శ్రీలంక ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఆ జట్టు దిగ్గజం లసిత్ మలింగ ఎంపికయ్యే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న ఆస్ట్రేలియా సిరీస్‌కు మలింగని కన్సల్టెంట్ కోచ్‌గా నియమించాలని హై-ప్రొఫైల్ క్రికెట్ అడ్వైజరీ కమిటీ శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి సిఫార్సు చేసింది. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
ఇక గత ఏడాదిలో అన్ని ఫార్మాట్ల నుంచి మలింగను తప్పుకున్న సంగతి తెలిసిందే. తన టీ20 కేరిర్‌లో 390 వికెట్లు పడగొట్టాడు. అంతే కాకుండా తొమ్మిది వన్డేల్లో శ్రీలంక జట్టుకు నాయకత్వం వహించిన మలింగ ఒక్క సారి కూడా జట్టును గెలిపించ లేకపోయాడు. అదే విధంగా 24 టీ20ల్లో సారధ్యం వహించిన మలింగకు 15 సార్లు పరాజయం ఎదురైంది. ఇక అతడితో పాటు మహేల జయవర్ధనే కూడా కన్సల్టెంట్ కోచ్‌గా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment