
మలింగా అరుదైన ఘనత
కొలంబో: భారత్ తో నాల్గో వన్డేలో శ్రీలంక పేస్ బౌలర్ లసిత్ మలింగా అరుదైన ఘనతను అందుకున్నారు. వన్డేల్లో మూడొందల వికెట్ ను సాధించడం ద్వారా ఈ ఘనతను అతి తక్కువ మ్యాచ్ లో సాధించిన ఐదో బౌలర్ గా మలింగా నిలిచారు. భారత కెప్టెన్ కోహ్లిని అవుట్ చేసి మలింగా 300 వికెట్ల మార్కును అందుకోవడం ఇక్కడ మరో విశేషం. మలింగా 203 మ్యాచ్ ల్లో మూడొందల వన్డే వికెట్ల మార్కును చేరుకున్నారు. దాంతో వసీం అక్రమ్(208)ను మలింగా వెనక్కునెట్టారు.
వన్డే ఫార్మాట్ లో అతి తక్కువ మ్యాచ్ ల్లో మూడొందల వికెట్లను సాధించిన వారిలో బ్రెట్ లీ(171) తొలి స్థానంలో ఉండగా, వకార్ యూనిస్(186) రెండో స్థానంలో ఉన్నారు. ఇక మెక్ గ్రాత్(200), మురళీ ధరన్ (202)లు తరువాతి స్థానాల్లో నిలిచారు.