
PC: IPL.com
రాజస్తాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌పై ఆ జట్టు బౌలింగ్ కోచ్, శ్రీలంక లెజెండ్ లసిత్ మలింగ ప్రశంసల వర్షం కురిపించాడు. పరాగ్ అద్భుతమైన ఫీల్డింగ్ తనను ఎంతగానో ఆకట్టుకుందని మలింగ తెలిపాడు. కాగా ఈ ఏడాది సీజన్‌లో పరాగ్ ఇప్పటివరకు 16 క్యాచ్‌లను అందుకున్నాడు. తద్వారా ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్(వికెట్ కీపర్ కాకుండా) గా పరాగ్ రికార్డు సాధించాడు.
గత 15 మ్యాచ్‌లలో రియాన్ ఫీల్డింగ్‌ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. అతడికి చాలా ఎనర్జీ ఉంది. అతడు మంచి అథ్లెటిక్. అతడికి బ్యాటింగ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు రాలేదు. కానీ ఫీల్డ్‌లో మాత్రం తన ఫీల్డింగ్‌తో అద్భుతం చేస్తున్నాడు. మరే ఇతర జట్టులో కూడా ఇటువంటి ఫీల్డింగ్‌ను మీరు చూసిఉండరు" అని మలింగ పేర్కొన్నాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా ఆదివారం ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది.
చదవండి: IPL 2022: ఫైనల్‌కు 6000 మంది పోలీసులతో భారీ భద్రత.. కారణం అదేనా?
Comments
Please login to add a commentAdd a comment