IPL 2021 2nd Phase: 'మలి'.. నిజంగా నువ్వు చాంపియన్‌వి | MI Captain Rohit Sharma Praise Lasith Malinga You Are Champion Cricketer | Sakshi
Sakshi News home page

Rohit And Lasith Malinga: 'మలి'.. నిజంగా నువ్వు చాంపియన్‌వి

Published Wed, Sep 15 2021 2:10 PM | Last Updated on Wed, Sep 15 2021 3:50 PM

MI Captain Rohit Sharma Praise Lasith Malinga You Are Champion Cricketer - Sakshi

ఫొటో: ఐపీఎల్‌

దుబాయ్‌: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ లంక మాజీ స్టార్‌ క్రికెటర్‌ లసిత్‌ మలింగపై ప్రశంసల వర్షం కురిపించాడు.  మలింగ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రోహిత్‌ శర్మ మలింగకు ముంబై ఇండియన్స్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అతనికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. 

చదవండి: Lasit Malinga: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు; ఇక ఎవరికి సాధ్యం

''మలి నిజంగా నువ్వు ఒక చాంపియన్‌వి.. నీ క్రికెట్‌ కెరీర్‌ ఆధ్యంతం అద్భుతంగా సాగింది. ముంబై ఇండియన్స్‌తో 12 ఏళ్ల అనుబంధం నీది.. జట్టు విజయాల్లో నీ పాత్ర మరువలేనిది.. నాలుగు సార్లు టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించావు. క్రికెట్‌ అనంతరం కూడా నీ జీవితం హాయిగా సాగిపోవాలని కోరుకుంటున్నా'' అంటూ తెలిపాడు. ముంబై ఇండియర్స్‌ మరో క్రికెటర్‌ సూర్యకుమార్‌ కూడా మలింగ రిటైర్మెంట్‌పై ట్వీట్‌ చేశాడు.'' ఒక బౌలర్‌గా నీ కెరీర్‌ అద్భుతంగా సాగింది.. ఆటకు వీడ్కోలు తర్వాత మొదలుపెట్టనున్న కొత్త జీవితం హాయిగా సాగిపోవాలని కోరుకుంటున్నా'' అని తెలిపాడు.

శ్రీలంక తరఫున ఎన్నో అద్భుత ప్రదర్శనలు చేసిన మలింగ భారత అభిమానులకు ఐపీఎల్‌ ద్వారా మరింత చేరువయ్యాడు. ముంబై ఇండియన్స్‌ 4 సార్లు (2013, 2015, 2017, 2019) ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలవడంలో అతను ప్రధాన భూమిక పోషించాడు. ఈ లీగ్‌లో 2009 నుంచి 11 సీజన్ల పాటు అతను ఒకే ఒక జట్టు ముంబైకే ప్రాతినిధ్యం వహించాడు. 122 ఐపీఎల్‌లో మ్యాచ్‌లలో 7.14 ఎకానమీతో 170 వికెట్లు తీసిన మలింగ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండటం విశేషం.

చదవండి: Lasith Malinga: ఇకపై ఆ యార్కర్లు కనిపించవు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement