నాడు కోహ్లితో ఏం చెప్పాడో రివీల్ చేసిన సచిన్ (PC: Twitter)
Sachin Tendulkar- Virat Kohli- ICC World Cup 2011 Final: భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్-2011 ట్రోఫీని ధోని సారథ్యంలోని టీమిండియా ముద్దాడిన దృశ్యాలు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంక.. భారత్ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
సెహ్వాగ్, సచిన్ త్వరత్వరగా
ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాను శ్రీలంక దిగ్గజ పేసర్ లసిత్ మలింగ ఆదిలోనే దెబ్బ కొట్టాడు. భారత ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్(0), సచిన్ టెండ్కులర్(18)ను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం గౌతం గంభీర్(97), ధోని(91) అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిసి భారత్‌కు రెండో సారి వన్డే ప్రపంచకప్‌ను అందించారు.
నాడు కోహ్లికి ఏం చెప్పారు?
ఇదిలా ఉంటే.. సచిన్ పెవిలియన్‌కు వెళ్లే క్రమంలో బ్యాటింగ్‌కు వస్తున్న విరాట్ కోహ్లితో ముచ్చటించిన విషయం క్రికెట్ ప్రేమికులకు గుర్తుండే ఉంటుంది. తాజాగా ఆనాటి ఆ ఘటన గురించి చెప్పమని ఓ నెటిజన్ సచిన్ టెండుల్కర్‌ను ఆడిగాడు.
బంతి కాస్త స్వింగ్ అవుతోంది
ఆస్క్ సచిన్ సెషన్‌లో భాగంగా శుక్రవారం ఈ మేరకు ప్రశ్న ఎదురుకాగా.. "బంతి కొద్దిగా స్వింగ్ అవుతోంది, జాగ్రత్త" అని చెప్పానంటూ సచిన్ బదులిచ్చాడు. ఇక సచిన్ అవుటైన తర్వాత నాడు క్రీజులోకి వచ్చిన కోహ్లి గంభీర్‌తో కలిసి 83 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన విరాట్.. 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దిల్షాన్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక యువరాజ్ సింగ్‌తో కలిసి ధోని ఫినిషింగ్ టచ్ ఇచ్చి భారత్‌ను విజయతీరాలకు చేర్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
సుదీర్ఘ నిరీక్షణకు ఆరోజుతో తెర
ఇక 2011, ఏప్రిల్ 2న భారత్ మరోసారి ప్రపంచ విజేతగా నిలవడంతో తన సుదీర్ఘ కెరీర్‌లో ఐసీసీ టైటిల్ లేదన్న సచిన్ టెండుల్కర్ నిరీక్షణకు తెరపడింది. ఆరోసారి ప్రపంచకప్ బరిలోకి దిగిన అతడి ఖాతాలో టైటిల్ చేరింది.
ఈ నేపథ్యంలో చాంపియన్‌గా అవతరించిన అనంతరం ఈ టీమిండియా దిగ్గజాన్ని భుజాలపై ఊరేగిస్తూ సహచర ఆటగాళ్లు అతడికి సముచిత గౌరవం ఇచ్చారు. నాటి ఆ దృశ్యాలు ఇప్పటికీ క్రికెట్ ప్రేమికుల మనసులో మెదలుతూనే ఉంటాయి.
చదవండి: పంజాబ్‌తో మ్యాచ్..ముంబై కెప్టెన్‌గా సూర్యకుమార్! మరి రోహిత్?
నువ్వేమీ ముసలోడివి కాలేదు!; సచిన్‌లా 16 ఏళ్లకే ఆట మొదలెడితే: ధోని
Comments
Please login to add a commentAdd a comment