లసిత్ మలింగ (PC: IPL)
Lasith Malinga returns to MI?: శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగ ముంబై ఇండియన్స్‌లో పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. ఐపీఎల్-2024 నేపథ్యంలో ఎంఐ బౌలింగ్ కోచ్‌గా మలింగ తిరిగిరానున్నట్లు తెలుస్తోంది. షేన్ బాండ్ స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రికార్డు స్థాయిలో వికెట్లు
కాగా 2008 నుంచి 2020 వరకు మలింగ ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన విషయం తెలిసిందే. మొత్తంగా 122 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఈ స్టార్ పేసర్ రికార్డు స్థాయిలో 170 వికెట్లు పడగొట్టాడు. 2021లో రిటైరైన తర్వాత బౌలింగ్ కోచ్‌గా అవతారమెత్తిన మలింగ రాజస్తాన్ రాయల్స్ క్యాంపులో చేరాడు.
రాజస్తాన్ రాయల్స్‌తో
2022, 2023 సీజన్లలో రాయల్స్ పేస్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఇదిలా ఉంటే.. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరిన రాజస్తాన్.. ఈసారి ఐదో స్థానంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోచింగ్ స్టాఫ్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం.
యుజీ చహల్‌తో మలింగ (PC: IPL)
ఈ నేపథ్యంలో లసిత్ మలింగ రాయల్స్‌ను వీడి ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా రానున్నట్లు తెలుస్తోంది. ఎంఐతో తొమ్మిదేళ్లుగా అనుబంధం కొనసాగిస్తున్న షేన్ బాండ్.. ఫ్రాంఛైజీతో తెగదెంపులు చేసుకుంటున్న తరుణంలో అతడి స్థానాన్ని మలింగ భర్తీ చేయనున్నట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫో కథనంలో పేర్కొంది.
నాలుగుసార్లు ట్రోఫీ గెలిచి
లసిత్ మలింగ ఖాతాలో నాలుగు ఐపీఎల్ టైటిళ్లు ఉన్నాయి. 2013, 2015, 2017, 2019లో ట్రోఫీ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో అతడు సభ్యుడు. ఇదిలా ఉంటే.. తాజా ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ టైటిల్ పోరుకు అర్హత సాధించలేకపోయింది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి విజేతగా అవతరించి ముంబై రికార్డును సమం చేసింది.
చదవండి: అప్పట్లో ఒకడుండేవాడు.. అతడే ధోని! కానీ రోహిత్ మాత్రం: పాక్ దిగ్గజం
Lasith Malinga has replaced Shane Bond as Mumbai Indians' bowling coach for IPL 2024. (Espncricinfo). pic.twitter.com/5fgHDEkHpI
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 19, 2023
Comments
Please login to add a commentAdd a comment