మలింగా దూరం:టీ20 కెప్టెన్గా చండీమాల్ | Chandimal named T20 skipper in Malinga’s absence | Sakshi
Sakshi News home page

మలింగా దూరం:టీ20 కెప్టెన్గా చండీమాల్

Published Tue, Dec 29 2015 7:30 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

మలింగా దూరం:టీ20 కెప్టెన్గా చండీమాల్ - Sakshi

మలింగా దూరం:టీ20 కెప్టెన్గా చండీమాల్

క్రైస్ట్‌చర్చ్: త్వరలో న్యూజిలాండ్ తో జరుగనున్న ట్వంటీ 20 సిరీస్ కు దినేష్ చండీమాల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. సుదీర్ఘకాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న లషిత్ మలింగా ట్వంటీ 20 సిరీస్ కు దూరం కావడంతో అతని స్థానంలో కెప్టెన్గా చండీమాల్ను నియమించారు.

 

అంతకుముందు 2013 లో తొలిసారి చండీమాల్ ట్వంటీ 20 కెప్టెన్ గా వ్యవహరించాడు. చండీమాల్ నేతృత్వంలోని శ్రీలంక 12 ట్వంటీ -20 మ్యాచ్ లు ఆడగా ఎనిమిదింట గెలిచింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డు.. చండీమాల్ కు మరోసారి ట్వంటీ 20 సారథ్య  బాధ్యతలు అప్పజెప్పింది.  ఇదిలాఉండగా మలింగా స్థానంలో బౌలర్గా సురంగా లక్మల్ ఎంపికయ్యాడు.


ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్నఐదు వన్డేల సిరీస్లో 2-0 తేడాతో వెనుకబడి ఉన్న శ్రీలంకకు మలింగా లేకపోవడం ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. గత నవంబర్లో శ్రీలంకలో వెస్టిండీస్తో జరిగిన తొలి ట్వంటీ 20లో మలింగా చివరిసారి కన్పించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement