కొలంబో : శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగ వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాడు. ఈ నెల 26న బంగ్లాదేశ్‌తో జరిగే తొలి మ్యాచ్ తర్వాత వన్డేలకు మలింగ గుడ్‌బై చెబుతున్నట్లు లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే ప్రకటించాడు. ఈ విషయం మలింగ తనకు చెప్పాడని కరుణరత్నే వెల్లడించాడు. 36 ఏళ్ల మలింగ 15 ఏళ్ల కెరీర్‌లో 225 వన్డేల్లో 29.02 సగటుతో 335 వికెట్లు పడగొట్టాడు. మురళీధరన్ (523), చమిందా వాస్ (399) తర్వాత వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన లంక బౌలర్‌గా అతను నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment