మలింగాను అనుకరించబోయి.. !! | When Krunal Pandya bowled like Lasith Malinga during IPL match | Sakshi
Sakshi News home page

మలింగాను అనుకరించబోయి.. !!

Published Mon, May 16 2016 6:27 PM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

మలింగాను అనుకరించబోయి.. !!

మలింగాను అనుకరించబోయి.. !!

శ్రీలంక బౌలర్‌ లసిత్‌ మలింగా బౌలింగ్‌ గురించి అందరికీ తెలిసిందే. అతనిది చాలా విలక్షణమైన బౌలింగ్‌. విలక్షణమైన బాడీలాంగ్వెజ్‌తో బౌలింగ్‌ చేసి బ్యాట్స్‌మన్‌ ను తికమకపెట్టడం మలింగా స్టైల్‌..

నిన్నటి వరకు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడిన మలింగాను ఈసారి అతని అభిమానులు చాలా మిస్సయ్యరనే చెప్పాలి. ఇప్పుడు మిచేల్ మెక్‌క్లెనఘన్‌, టిమ్‌ సౌథీ అతడు లేని లోటును పూడుస్తూ.. ముంబై ఇండియన్స్ తరఫున నిలకడగా బౌలింగ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై ఆటగాడు కృనాల్ పాండ్యా తాజాగా మలింగాను గుర్తుకుతెచ్చాడు.

బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లెఫ్ట్ ఆర్మ్‌ స్పిన్నర్‌ చాలా విలక్షణమైన బాడీ లాంగ్వెజ్‌తో బౌలింగ్‌ చేశాడు. అచ్చం మలింగాను తలపిస్తూ వేసిన ఈ బంతి వైడ్ కావడమే కాకుండా ఏకంగా కీపర్ ప్రయత్నించినా అందకుండా ఫోర్‌ వెళ్లింది. దీంతో రోహిత్‌ సేన ఇదేమీ బౌలింగో అర్థం కాక కాస్త తికమక పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement