ముంబై జట్టులో మలింగా చేరాడు కానీ.. | Malinga joins Mumbai Indians squad | Sakshi
Sakshi News home page

ముంబై జట్టులో మలింగా చేరాడు కానీ..

Published Sat, Apr 16 2016 3:09 PM | Last Updated on Sun, Sep 3 2017 10:04 PM

ముంబై జట్టులో మలింగా చేరాడు కానీ..

ముంబై జట్టులో మలింగా చేరాడు కానీ..

ముంబై: శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగా ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్తో చేరినా వెంటనే టోర్నీలో ఆడేది సందేహంగా మారింది. మోకాలి నొప్పితో బాధపడుతున్న మలింగ సెలెక్షన్కు అందుబాటులో ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఫిట్నెస్ కారణంగా ముంబై తొలి రెండు మ్యాచ్లకు అతను దూరంగా ఉన్నాడు. టోర్నీలో సగం మ్యాచ్లకు మలింగ దూరంగా ఉండవచ్చని ముంబై కోచ్ రికీ పాంటింగ్ చెప్పాడు.

గత నవంబర్ నుంచి మలింగా గాయాలతో బాధపడుతున్నాడు. ఎడమ మోకాలి గాయంతో బాధపడుతున్న లంక పేసర్ ఆసియా కప్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. ప్రతిష్టాత్మక టి-20 ప్రపంచ కప్లో కూడా పాల్గొనలేదు. మరోవైపు ఐపీఎల్లో ఆడేందుకుగాను మలింగాకు ఎన్ఓసీ ఇచ్చే ముందు అతడి ఫిట్నెస్ను పరిశీలించాల్సివుందని శ్రీలంక క్రికెట్ బోర్డు ఇటీవల తెలిపింది. తమ అనుమతి లేకుండా వెళ్తే బెంచ్పై కూర్చోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మలింగా ఎప్పటి నుంచి ఐపీఎల్లో ఆడుతాడన్న విషయంపై అనిశ్చితి ఏర్పడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement