
ముంబై: భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్‌కు వరల్డ్ కప్‌లో ఆడడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. 2019 వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టులో సభ్యుడైన 34 ఏళ్ల జాదవ్ ఐపీల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతూ గాయపడిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియా ఫిట్‌నెస్ ట్రైనర్ పాట్రిక్ పర్యవేక్షణలో తిరిగి ఫిట్‌నెస్ సాధించాడు.
గురువారం ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలో జాదవ్ పాస్ అయ్యాడని పాట్రిక్ బీసీసీఐకి నివేదించాడు. దీంతో జాదవ్ మిగతా సభ్యులతో కలిసి ఈ నెల 22న ఇంగ్లండ్‌కు పయనం కానున్నాడు. దాంతో జాదవ్ ఫిట్‌నెస్ నిరూపించుకోని పక్షంలో జట్టులో చోటు దక్కించుకోవచ్చనుకున్న స్టాండ్ బై ఆటగాళ్లు అంబటి రాయుడు, రిషభ్ పంత్‌లకు నిరాశే ఎదురైంది.