2023 మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ విజేతగా రత్నగిరి జెట్స్ నిలిచింది. వర్షం కారణంగా రిజర్వ్ డే కూడా పూర్తి మ్యాచ్ సాధ్యపడకపోవడంతో, పాయింట్ల పట్టికలో టాపర్‌గా ఉన్న రత్నగిరి జెట్స్‌ను విజేతగా ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం రత్నగిరి జెట్స్, కొల్హాపూర్ టస్కర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ గురువారమే (జూన్ 29) జరగాల్సి ఉండింది. అయితే ఆ రోజు వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో మ్యాచ్‌ను శుక్రవారానికి వాయిదా వేసారు. శుక్రవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాయింట్ల పట్టిక ఆధారంగా విజేతను ప్రకటించారు.
అప్పటికీ వర్షం ఎడతెరిపి ఇచ్చిన ప్రతిసారి మ్యాచ్‌ను నిర్వహించేందుకు నిర్వహకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో 16 ఓవర్ల ఆట కూడా జరిగింది. కేదార్ జాదవ్ నేతృత్వంలోని కొల్హాపూర్ టస్కర్స్ 16 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. ఈ సమయంలో మొదలైన వర్షం ఎంతకీ ఆగలేదు. దీంతో పాయింట్ల ఆధారంగా రత్నగిరి జెట్స్‌ను విజేతగా ప్రకటించారు. టస్కర్స్‌కు కూడా జెట్స్‌తో సమానంగా పాయింట్లు ఉండటంతో నెట్ రన్ ఆధారంగా విజేతను డిసైడ్ చేశారు. విన్నింగ్ జట్టు కెప్టెన్ అజీమ్ ఖాజీకి 50 లక్షల చెక్ లభించగా.. రన్నరప్ టస్కర్స్‌కు 25 లక్షల చెక్ అందింది.
Comments
Please login to add a commentAdd a comment