Maharashtra Premier League (MPL)
-
పాపం రుతురాజ్.. క్రికెట్ చరిత్రలో ఇలా ఎవరూ రనౌటై ఉండరు..!
టీమిండియా యువ ఓపెనర్, చెన్నై సూపర్ కింగ్స్ సారధి రుతురాజ్ గైక్వాడ్ వినూత్న రీతిలో రనౌటై వార్తల్లో నిలిచాడు. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో పుణేరీ బప్పా టీమ్‌కు సారథ్యం వహిస్తున్న రుతు.. నిన్న (జూన్ 7) రత్నగిరి జెట్స్తో జరిగిన మ్యాచ్‌లో ఎవరూ ఊహించని విధంగా రనౌటయ్యాడు. పుణేరీ బప్పా ఇన్నింగ్స్ 11వ ఓవర్లో రుతు రెండు పరుగులు రాబట్టే ప్రయత్నంలో బాధాకరమైన రీతిలో రనౌటయ్యాడు. రుతు రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో క్రీజ్‌లోకి చేరకముందే బ్యాట్‌కు అతని చేతికి కనెక్షన్ కట్టైంది. రుతురాజ్ బ్యాట్ క్రీజ్‌లోకి చేరినా అది అతని చేతిలో నుంచి జారిపోయింది. ఈ లోపు వికెట్‌కీపర్ వికెట్లను గిరాటు వేశాడు. రీప్లేలో రుతురాజ్ బ్యాట్ క్రీజ్‌కు తాకినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా బ్యాట్ అతని చేతిలో లేకపోవడంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ఈ రనౌట్ డ్రామాకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.Ruturaj Gaikwad was dismissed in a bizarre fashion during Maharashtra Premier League (MPL).pic.twitter.com/zQHMxWt1kX— OneCricket (@OneCricketApp) June 7, 2024కాగా, ఈ మ్యాచ్‌లో రుతురాజ్ సారథ్యం వహిస్తున్న పుణేరీ బప్పా జట్టు ప్రత్యర్థి రత్నగిరి జెట్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పుణేరీ టీమ్ 19.5 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. రత్నగిరి బౌలర్లలో సత్యజిత్ (4-0-24-4) పుణేరీ టీమ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. పుణేరీ ఇన్నింగ్స్‌లో పవన్ షా (32), రుతురాజ్ (29), యశ్ సాగర్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రత్నగిరి టీమ్.. 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ధీరజ్ (25), అజిమ్ ఖాజీ (31), నిఖిల్ నాయక్ (27 నాటౌట్), సత్యజిత్ (17 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేసి రత్నగిరి జెట్స్‌ను గెలిపించారు. -
ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగించిన రుతురాజ్.. మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభణ
యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ 2024 ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా జరుగుతున్న మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఈ లీగ్‌లో పూణేరీ బప్పాకు సారథ్యం వహిస్తున్న రుతు.. నిన్న (జూన్ 4) కొల్హాపూర్ టస్కర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ అర్దశతకం (35 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదాడు. ఫలితంగా పూణేరీ బప్పా 22 పరుగుల తేడాతో విజయం సాధించి, సీజన్ తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. రుతు ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్‌లోనూ పర్వాలేదనిపించాడు. ఈగల్ నాసిక్ టైటాన్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 21 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేశాడు. 2024 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రుతు.. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లోనూ తన జట్టుకు (పూణేరీ బప్పా) నాయకత్వం వహిస్తున్నాడు. అయితే రుతు ఐపీఎల్లోలా ఎంపీఎల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగడం లేదు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అతను మిడిలార్డర్లో బరిలోకి దిగాడు.మ్యాచ్ విషయానికోస్తే.. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పూణేరీ బప్పా 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. పూణేరీ ఇన్నింగ్స్‌లో రుతురాజ్ మినహా ఎవరూ రాణించలేదు. RUTURAJ GAIKWAD SHOW...!!!!- Captain Ruturaj smashed 61*(35) in 14 over game while batting in the middle order in the Maharashtra Premier League. 🔥🌟 pic.twitter.com/dumVXn87br— Johns. (@CricCrazyJohns) June 4, 2024శుభమ్ తైస్వాల్ (10), సూరజ్ షిండే (24), రాహుల్ దేశాయ్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. కొల్హాపూర్ టస్కర్స్ బౌలర్లలో నిహాల్ తుసామద్ 3 వికెట్లు పడగొట్టగా.. శ్రేయస్ చవాన్ 2, యశ్ కలాద్కర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టస్కర్స్ 14 ఓవర్లు బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. పూణేరీ బౌలర్లు పియుశ్ సాల్వీ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టారు. హర్ష్ సాంగ్వి (38), అంకిత్ పోర్వాల్ (28), అంకిత్ బావ్నే (21) ఓ మోస్తరు పరుగులు చేసినా టస్కర్స్‌కు ఓటమి తప్పలేదు. కాగా, కొద్ది రోజుల కిందట ముగిసిన ఐపీఎల్ 2024లో రుతురాజ్ సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సీజన్లో అతను 14 మ్యాచ్‌ల్లో సెంచరీ, నాలుగు అర్దసెంచరీల సాయంతో 583 పరుగులు చేశాడు. 15 మ్యాచ్‌ల్లో సెంచరీ, 5 అర్దసెంచరీల సాయంతో 741 పరుగులు చేసిన ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి సీజన్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. -
మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ 2023 విజేత రత్నగిరి జెట్స్
2023 మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ విజేతగా రత్నగిరి జెట్స్ నిలిచింది. వర్షం కారణంగా రిజర్వ్ డే కూడా పూర్తి మ్యాచ్ సాధ్యపడకపోవడంతో, పాయింట్ల పట్టికలో టాపర్‌గా ఉన్న రత్నగిరి జెట్స్‌ను విజేతగా ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం రత్నగిరి జెట్స్, కొల్హాపూర్ టస్కర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ గురువారమే (జూన్ 29) జరగాల్సి ఉండింది. అయితే ఆ రోజు వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో మ్యాచ్‌ను శుక్రవారానికి వాయిదా వేసారు. శుక్రవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాయింట్ల పట్టిక ఆధారంగా విజేతను ప్రకటించారు. అప్పటికీ వర్షం ఎడతెరిపి ఇచ్చిన ప్రతిసారి మ్యాచ్‌ను నిర్వహించేందుకు నిర్వహకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో 16 ఓవర్ల ఆట కూడా జరిగింది. కేదార్ జాదవ్ నేతృత్వంలోని కొల్హాపూర్ టస్కర్స్ 16 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. ఈ సమయంలో మొదలైన వర్షం ఎంతకీ ఆగలేదు. దీంతో పాయింట్ల ఆధారంగా రత్నగిరి జెట్స్‌ను విజేతగా ప్రకటించారు. టస్కర్స్‌కు కూడా జెట్స్తో సమానంగా పాయింట్లు ఉండటంతో నెట్ రన్ ఆధారంగా విజేతను డిసైడ్ చేశారు. విన్నింగ్ జట్టు కెప్టెన్ అజీమ్ ఖాజీకి 50 లక్షల చెక్ లభించగా.. రన్నరప్ టస్కర్స్‌కు 25 లక్షల చెక్ అందింది.