
డేవిడ్ విల్లే (ఫైల్ ఫొటో)
లండన్ : గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ స్థానంలో ఇంగ్లండ్ క్రికెటర్ డేవిడ్ విల్లే జట్టులోకి రానున్నాడు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో యార్క్‌షైర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నఈ ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ జట్టు తమ అధికారిక ట్విటర్‌లో పేర్కొంది. ఇక ఈ సీజన్ ఆరంభం ముందే గాయంతో న్యూజిలాండ్ బౌలర్ మిచెల్ సాంట్నర్ దూరమవ్వడంతో చెన్నైకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో తొడ నరాలు పట్టేయడంతో జాదవ్ టోర్నీ మొత్తానికి దూరం కావల్సి వచ్చింది. కీలకమైన ఇద్దరి ఆటగాళ్లను కోల్పోయిన చెన్నై డేవిడ్ విల్లేతో ఈ నష్టాన్ని పూడ్చాలని భావిస్తోంది.
ఇక బిగ్ బాష్‌లో పెర్త్ స్కార్చేర్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన డేవిడ్ ఇంగ్లండ్ తరఫున మాత్రం ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో రాణించడం.. చివర్లో బంతిని హిట్ చేయగల సత్తా ఉన్న ఆటగాడు కావడంతో చెన్నై డేవిడ్‌పై మొగ్గు చూపింది. అయితే డేవిడ్ నియామకంపై చెన్నై ఫ్రాంచైజీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment