ఆలస్యంగా రోహిత్, కేదర్ జాదవ్ | Rohit Sharma, Kedar Jadhav's England departure delayed | Sakshi
Sakshi News home page

ఆలస్యంగా రోహిత్, కేదర్ జాదవ్

Published Thu, May 25 2017 1:16 PM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM

ఆలస్యంగా రోహిత్, కేదర్ జాదవ్

ఆలస్యంగా రోహిత్, కేదర్ జాదవ్

న్యూఢిల్లీ:చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత క్రికెట్ జట్టు బృందం బుధవారం ఇంగ్లండ్ కు పయనం కాగా రోహిత్ శర్మ, కేదర్ జాదవ్లు కాస్త ఆలస్యంగా అక్కడికి బయల్దేరనున్నారు. కజిన్ వివాహం కారణంగా రోహిత్ శర్మ ఇంగ్లండ్ కు ఆలస్యంగా బయల్దేరుతుండగా, కేదర్ కు ఇంకా వీసా సర్దుబాటు కాలేకపోవడం వల్ల అతను అక్కడకు వెళ్లడం ఆలస్యమవుతుంది.

టీమిండియా  జట్టు ఇంగ్లండ్ కు బయల్దేరి సమయానికి కేదర్ జాదవ్కు ఇంకా క్లియరెన్స్ లభించకపోవడంతో అతని ఆలస్యంగా జట్టుతో కలవనున్నట్లు మేనేజ్మెంట్ తెలిపింది. ఈ మేరకు వీరిద్దరూ ఆలస్యంగా ఇంగ్లండ్ వెళ్లనున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తెలిపింది. తాను ఆలస్యంగా ఇంగ్లండ్ కు పయనం కానున్న విషయాన్ని రోహిత్ ముందుగానే తెలియజేసిన్టుల బీసీసీఐ పేర్కొంది. మరొకవైపుకేదర్ జాదవ్ శుక్రవారం ఇంగ్లండ్ విమానం ఎక్కే అవకాశం ఉంది. జూన్ 1 వ తేదీ నుంచి ఆరంభమయ్యే చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement