ఫైనల్లో భారత్ ‘ఎ’ | bharath a in final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో భారత్ ‘ఎ’

Published Thu, Jan 28 2016 2:28 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM

bharath a in final

♦ రాణించిన కేదార్ జాదవ్ 
♦ దేవధర్ ట్రోఫీ కాన్పూర్


కేదార్ జాదవ్ (61 బంతుల్లో 91 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), అంబటి తిరుపతి రాయుడు (89 బంతుల్లో 75; 9 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా రాణించడంతో భారత్ ‘ఎ’ జట్టు... దేవధర్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ‘ఎ’.. 6 వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 49.2 ఓవర్లలో 272 పరుగులకు ఆలౌటైంది. పార్థివ్ పటేల్ (125 బంతుల్లో 119; 16 ఫోర్లు) సెంచరీతో చెలరేగినా... మిగతా వారు నిరాశపర్చారు. అమిత్ మిశ్రా, పర్వేజ్ రసూల్ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం భారత్ ‘ఎ’ 47.2 ఓవర్లలో 4 వికెట్లకు 273 పరుగులు చేసింది. ఓపెనర్ ఫజల్ (53) అర్ధసెంచరీతో శుభారంభం ఇచ్చాడు. మెహుల్ పటేల్ 2 వికెట్లు తీశాడు. గురువారం జరిగే ఫైనల్లో భారత్ ‘ఎ’ జట్టు... భారత్ ‘బి’తో తలపడుతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement