kumara Sangakkara
-
రైనాకు హ్యాండ్ ఇచ్చిన ఫ్రాంచైజీలు.. కారణం ఇదే అంటున్న కుమార సంగక్కర
జైపూర్: భారత క్రికెట్ ప్లేయర్ సురేష్ రైనా.. తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోకపోయిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సురేష్ రైనాకు ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం హ్యాండిచ్చింది. అయితే, ఐపీఎల్‌కు రైనాకు సూపర్ రికార్డుల ఉన్నప్పటికీ వేలంలో మాత్రం అమ్ముడుపోకపోవడం అందరనీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, రైనా 2020 ఐపీఎల్ ఎడిషన్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడలేదు. కొన్ని కుటుంబ సమస్యల కారణంగా ఆ సీజన్‌కు దూరమయ్యాడు. ఇక 2021 సీజన్లో మొదటి మ్యాచ్ ఆడిన రైనా ఢిల్లీ క్యాపిటల్స్‌పై మాత్రమే అర్ధ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మెరుగైన ప్రదర్శన ఇవ్వలేదు. దీంతో వేలంలో ఆ ప్రభావం కనిపించింది. రైనాను కొనుగోలు చేయకపోవడంపై రాజస్థాన్ జట్టు కోచ్ కుమార సంగక్కర స్పందిస్తూ.. రైనాపై ఆసక్తి చూపించకపోవడంపై ఎన్నో కారణాలు ఉండొచ్చన్నాడు. సుదీర్ఘ కేరీర్లో కాలం గడిచే కొద్ది ప్లేయర్స్ ఆటలో మార్పులు వస్తాయన్నారు. యువ ఆటగాళ్లు సైతం రాణించడంతో ఫ్రాంచైజీలు వారిపై ఫోకస్ పెడుతున్నాయని అన్నాడు. రైనాకి ఐపీఎల్లో మంచి రికార్డులు ఉన్నాయన్నాడు. అతను లెంజడరీ క్రికెటర్ అయినప్పటికీ సీజన్లో అతని ఆటతీరును బట్టే కొనుగోలు చేయలేదన్నాడు. మంచి ప్రదర్శన చేసిన వారిపైనే కోచ్‌లు, ఫ్రాంచైజీల ఫోకస్ ఉంటుదన్నారు. -
ఉత్కంఠ పోరులో శ్రీలంక విజయం
లండన్: బ్యాటింగ్‌లో సెంచరీతో సంగక్కర (104 బంతుల్లో 112; 14 ఫోర్లు), బౌలింగ్‌లో మూడు వికెట్లతో మలింగ (3/52) చెలరేగడంతో... ఇంగ్లండ్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన నాలుగో వన్డేలో శ్రీలంక 7 పరుగులతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 300 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసింది. ఒక దశలో 111 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఇక్కట్లలో పడిన ఇంగ్లండ్‌ను జోస్ బట్లర్ (74 బంతుల్లో 121; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. అయితే ఆఖరి 3 బంతుల్లో 9 పరుగులు అవసరమైన దశలో బట్లర్ రనౌట్ కావడంతో ఇంగ్లండ్ గెలుపు అంచుల దాకా వచ్చి ఓడింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమమైంది. చివరి వన్డే ఈ నెల 3న జరగనుంది. -
'కుమార సంగక్కర గొప్ప ఆటగాడేమీ కాదు'
లండన్: ఈ మధ్యే ప్రపంచ కప్ ట్వంటీ 20 క్రికెట్ లో విశేష ప్రతిభ కనబరిచి శ్రీలంకను విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించిన కుమార సంగక్కర గొప్ప ఆటగాడేమి కాదంటూ దుర్ హామ్ కౌంటీ కోచ్ జాన్ లూయిస్ అభిప్రాయపడ్డాడు. పొట్టి ఫార్మట్ నుంచి వీడ్కోలు తీసుకున్న సంగక్కర దుర్ హామ్ జట్టు తరుపున దిగడానికి సంతకం చేయబోతున్నాడన్న వార్తల నేపథ్యంలో లూయిస్ ఈ మేరకు స్పందించారు. అతను(సంగక్కరా) దుర్ హామ్ జట్టులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందంటూనే, ప్రపంచలో అతను చెప్పుకోదగ్గ ఆటగాడేమీ కాదని తెలిపారు. సంగక్కరాను దుర్ హామ్ కు ప్రాతినిధ్యం వహిస్తాడన్న వార్తలపై మాత్రం జట్టు యాజమాన్యం అధికారకంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. గత 2007 లో వార్విక్ షైర్, 2010లో లాంక్ షైర్ కౌంటీ జట్లుకు సంగక్కర సంతకం చేసినా ఆడటకపోవడంతో ప్రస్తుత జట్టు మేనేజ్ మెంట్ అది పునరావృతం కాకుండా ఉండే విధంగా చూసుకుండేదుకు యత్నాలు చేస్తోంది. అంతర్జాతీయ ట్వంటీ 20ల నుంచి వైదొలిగిన సంగక్కర ప్రస్తుత యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) కూడా దూరంగా ఉన్నాడు.