ఉత్కంఠ పోరులో శ్రీలంక విజయం | srilanka won fourth one day international against england team | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ పోరులో శ్రీలంక విజయం

Published Sun, Jun 1 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM

ఉత్కంఠ పోరులో శ్రీలంక విజయం

ఉత్కంఠ పోరులో శ్రీలంక విజయం

 లండన్: బ్యాటింగ్‌లో సెంచరీతో సంగక్కర (104 బంతుల్లో 112; 14 ఫోర్లు), బౌలింగ్‌లో మూడు వికెట్లతో మలింగ (3/52) చెలరేగడంతో...  ఇంగ్లండ్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన నాలుగో వన్డేలో శ్రీలంక 7 పరుగులతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 300 పరుగుల భారీ స్కోరు సాధించింది.
 
 లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసింది. ఒక దశలో 111 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఇక్కట్లలో పడిన ఇంగ్లండ్‌ను జోస్ బట్లర్ (74 బంతుల్లో 121; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. అయితే ఆఖరి 3 బంతుల్లో 9 పరుగులు అవసరమైన దశలో బట్లర్ రనౌట్ కావడంతో ఇంగ్లండ్ గెలుపు అంచుల దాకా వచ్చి ఓడింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమమైంది. చివరి వన్డే ఈ నెల 3న జరగనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement