fourth one day
-
కోలుకొని కొట్టేయాల్సిందే..
సరిగ్గా రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లోనే 3–2తో వన్డే సిరీస్ గెలుచుకుంది. ఆ తర్వాత సొంతగడ్డపై ఏ సిరీస్‌లో కూడా టీమిండియా రెండు మ్యాచ్‌లు ఓడిపోలేదు. అయితే ఇప్పుడు మూడో వన్డే ఫలితం తర్వాత మరోసారి అలాంటి సందేహం కనిపిస్తోంది. అభేద్యమైన కోహ్లి సేన అతి సునాయాసంగా సిరీస్ గెలుస్తుందని భావిస్తే వెస్టిండీస్ ఒక్క సారిగా పరిస్థితిని మార్చేసింది. ముందుగా ‘టై’తో బయటపడి ఆ తర్వాత పూర్తి స్థాయి బలగం ఉండి కూడా మ్యాచ్ ఓడిన భారత్... వెంటనే దానికి ప్రతీకారం తీర్చుకోవాలంటే రెట్టింపు శ్రమించాల్సి ఉంది. మరోవైపు సమష్టి ప్రదర్శనతో సాధించిన గెలుపు విండీస్ శిబిరంలో ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం పెంచేసింది. ఈ నేపథ్యంలో నాలుగో మ్యాచ్ కీలకంగా మారింది. ముంబై: భారత జట్టు గత ఏడాది దాదాపు ఇదే సమయంలో సొంతగడ్డపై శ్రీలంకతో ఆడుతున్నా... రాబోయే దక్షిణాఫ్రికా పర్యటన గురించే ఎక్కువగా ఆలోచించింది. ఇప్పుడూ అలాగే ఆస్ట్రేలియా సిరీస్‌కే సిద్ధమైపోవాల్సిన సమయంలో వెస్టిండీస్‌తో మ్యాచ్‌ను కూడా సీరియస్‌గా తీసుకోవాల్సి వస్తోంది! విండీస్ పోరాటపటిమ కోహ్లి సేనను అలా మార్చేసింది. తొలి వన్డేలో 322 పరుగులు చేసి... రెండో మ్యాచ్‌లో విజయానికి చేరువగా వచ్చి... మూడో మ్యాచ్‌లో ఏకంగా గెలుపు రుచి చూసిన హోల్డర్ బృందం మన జట్టుకు సవాల్ విసిరింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు నేడు నాలుగో వన్డేలో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ప్రతిష్టాత్మక వాంఖడే మైదానంలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను కాంప్లిమెంటరీ పాస్‌ల వివాదం నేపథ్యంలో బ్రబోర్న్ స్టేడియానికి (సీసీఐ) మార్చారు. జాదవ్‌కు చోటు... ఒక్క మ్యాచ్‌కే మిడిలార్డర్ వైఫల్యం అని సూత్రీకరించలేం కానీ ప్రమాద ఘంటిక మాత్రం మోగినట్లే. టాప్–3లో ఒక మ్యాచ్‌లో కనీసం ఇద్దరు అద్భుతంగా ఆడుతుండటంతో భారత్‌కు ఇప్పటి వరకు ఈ సమస్య కనిపించలేదు. కానీ రోహిత్, ధావన్ విఫలం కావడం... మిడిల్, లోయర్ ఆర్డర్లలో ఎవరూ కోహ్లికి అండగా నిలవకపోవ డంతో భారత్ గత వన్డేలో పరాజయం పాలైంది. నాలుగో స్థానం కోసం ఇప్పటికే కోహ్లి విశ్వాసం పొందిన అంబటి రాయుడు నిలకడగా రాణించడం ఎంతో అవసరం. ఇక ఐదు, ఆరు స్థానాల్లో పంత్, ధోని సత్తా చాటితేనే జట్టుకు విజయావకాశాలు ఉంటాయి. పంత్‌కు తొలి సిరీస్ కాబట్టి ఇంకా సమయం పట్టవచ్చు కానీ ఇప్పటికే టి20ల్లో చోటు కోల్పోయిన ధోని తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. అతను ధనాధన్ షాట్లు ఆడి చాలా కాలం కాగా... వన్డే శైలికి తగినట్లుగా స్ట్రయిక్ రొటేట్ చేస్తూ కీలక పరుగులు సాధించాల్సి ఉంది. పుణే వన్డేలో ఐదుగురు బౌలర్లతో ఆడటంతో ఏడో స్థానంలోనే భువనేశ్వర్ బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. ఈసారి ఖలీల్ స్థానంలో జడేజాకు అవకాశం దక్కితే జట్టు బ్యాటింగ్ మెరుగవుతుంది. మరోవైపు కేదార్ జాదవ్ కూడా తుది జట్టులో ఆడటం దాదాపుగా ఖాయమైంది. అతని వైవిధ్యమైన బౌలింగ్ జట్టుకు అదనపు బలం కానుంది. అయితే జాదవ్‌ను ఆడించేందుకు పంత్‌ను పక్కన పెడతారా అనేది చూడాలి. అన్నింటికి మించి తిరుగులేని ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న విరాట్ కోహ్లి అత్యద్భుత ఫామ్‌తో భారత్ పైచేయిగానే కనిపిస్తోంది. అయితే అతని ఒక్కడి ఆట విజయానికి సరిపోదని గత మ్యాచ్ నిరూపించిన నేపథ్యంలో టీమిండియా సమష్టిగా చెలరేగాల్సి ఉంది. అదే జట్టుతో... తమ బ్యాటింగ్ ప్రదర్శనే భారత జట్టు ప్రధాన పేసర్లు బుమ్రా, భువనేశ్వర్‌లను తిరిగి జట్టులోకి తీసుకొనేలా చేసిందని వ్యాఖ్యానించిన వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ లా మూడో వన్డేలో తమ జట్టు ఆటతో కచ్చితంగా సంతోషించి ఉంటాడు. బుమ్రా నాలుగు వికెట్లు తీసినా... భువనేశ్వర్ పెద్దగా ప్రభావం చూపలేదు. ఇప్పుడు మరోసారి అదే జోరు కొనసాగించాలని విండీస్ భావిస్తోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న షై హోప్, అతనికి తోడుగా చెలరేగిపోతున్న హెట్‌మైర్‌లు మళ్లీ ఇన్నింగ్స్‌లో కీలకం కానున్నారు. కెప్టెన్ హోల్డర్ ఆల్‌రౌండ్ నైపుణ్యం పుణేలో కనిపించగా... అనూహ్యంగా నర్స్ కూడా తన బ్యాటింగ్ బలాన్ని చూపించాడు. బౌలర్లను లెక్క చేయకుండా ఎదురుదాడి చేస్తేనే ఫలితం ఉంటుందని విండీస్ గత రెండు మ్యాచ్‌ల్లోనూ చూపించింది. ఇప్పుడూ అదే విశ్వాసంతో ఆడితే మరోసారి ఆ జట్టుది పైచేయి కావచ్చు. బ్యాటింగ్‌లో మెరవకపోయినా మూడు కీలక వికెట్లు తీసిన శామ్యూల్స్ అనుభవం కూడా విండీస్‌కు పనికొస్తోంది. కోహ్లిని ఆపలేకపోయినా... ఇతర ఆట గాళ్లను కట్టడి చేయగలిగితే మ్యాచ్ గెలవొచ్చని ఆ జట్టుకు అర్థమైంది. మూడో వన్డేలో ప్రతీ ఒక్కరు తమ బాధ్యతను నెరవేర్చడంతో తుది జట్టులో మా ర్పులు చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాయుడు, పంత్/ జాదవ్, ధోని, జడేజా, భువనేశ్వర్, చహల్, కుల్దీప్, బుమ్రా. వెస్టిండీస్: హోల్డర్ (కెప్టెన్), కీరన్ పావెల్, హేమ్రాజ్, హోప్, శామ్యూల్స్, హెట్‌మైర్, రావ్మన్ పావెల్, అలెన్, నర్స్, రోచ్, మెక్కాయ్. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. సిరీస్‌లోని గత మ్యాచ్‌లలాగే భారీ స్కోరుకు అవకాశం ఉంది. అయితే ఇక్కడ 2017 ఫిబ్రవరి తర్వాత ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ కూడా జరగలేదు కాబట్టి అంచనా వేయడం కష్టంగా మారింది. ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అయితే 2009లో (శ్రీలంకతో టెస్టు) అయింది. ధోని తీవ్ర సాధన... ఫామ్ కోల్పోయి, టి20ల్లో చోటు కోల్పోయి పరుగుల కోసం తంటాలు పడుతున్న మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అదనంగా శ్రమించేందుకు సిద్ధమయ్యాడు. మ్యాచ్ ముందు రోజు ఆదివారం ‘ఆప్షనల్ ప్రాక్టీస్’ అయినా అతను మాత్రం నెట్స్‌లో చెమటోడ్చాడు. స్థానిక బౌలర్లు బంతులు వేయగా దాదాపు 45 నిమిషాల పాటు ధోని బ్యాటింగ్ చేశాడు. ధోనితో పాటు రోహిత్, అంబటి రాయుడు, కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్ సాధన చేయగా మిగతా జట్టు సభ్యులు మాత్రం ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు. వెస్టిండీస్ ఆటగాళ్లు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. -
168 పరుగులతో భారత్ విజయం
-
పాకిస్తాన్ 247/8
ఇంగ్లండ్‌తో నాలుగో వన్డే హెడింగ్లి: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్ పరువు కోసం పోరాడుతోంది. ఇంగ్లండ్‌తో గురువారం జరిగిన నాలుగో వన్డేలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. కెప్టెన్ అజార్ అలీ (104 బంతుల్లో 80; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇమద్ వసీమ్ (41 బంతుల్లో 57 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు. -
దసరా ధమాకా!
దసరా పండుగనాడు భారత క్రికెట్ అభిమాని సంబరపడ్డాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ మొదలైన దగ్గర్నించి పడుతూ లేస్తూ సాగుతున్న భారత క్రికెట్ జట్టు... దసరా రోజు మాత్రం సంచలన ఆటతీరు కనబరిచింది. ప్రపంచకప్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మొత్తం జట్టంతా కలిసికట్టుగా ఆడి ప్రత్యర్థిని చిత్తు చేసింది. అన్ని విభాగాల్లోనూ సాధికారిక ఆటతీరుతో ధోనిసేన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికాపై గెలిచి పండుగ సంబరాన్ని రెట్టింపు చేసింది. కోహ్లి సెంచరీకి బౌలర్ల సమష్టి కృషి తోడవడంతో... సిరీస్‌లో నిలబడింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలియర్స్ విభిన్న షాట్లతో వణుకు పుట్టించినా... భారత విజయాన్ని అడ్డుకోలేకపోయాడు. ఇక సిరీస్ ఫలితం తేలేది ఆదివారం ముంబైలో జరిగే చివరి వన్డేలోనే. * నాలుగో వన్డేలో భారత్ విజయం * విరాట్ కోహ్లి సెంచరీ * డివిలియర్స్ శతకం వృథా * చివరి వన్డే ఆదివారం ముంబైలో చెన్నై: దక్షిణాఫ్రికాతో నాలుగో వన్డేకు ముందు విరాట్ కోహ్లి వన్డేల్లో 22 సెంచరీలు చేస్తే భారత్ 21సార్లు గెలిచింది. అందుకే కోహ్లి నిలకడగా ఆడటం భారత్‌కు అవసరం. మరోసారి కూడా అదే సంప్రదాయం పునరావృతమైంది. కోహ్లి శతకంతో భారత్‌ను గెలిపించాడు. రాజ్‌కోట్ మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చిన భారత వైస్ కెప్టెన్ చెపాక్‌లో చెలరేగాడు. ఫలితంగా గురువారం జరిగిన నాలుగో వన్డేలో భారత్ 35 పరుగులతో సఫారీలను ఓడించింది. ఐదు వన్డేల సిరీస్ ప్రస్తుతం 2-2తో సమమైంది. ఆఖరి వన్డే ఆదివారం ముంబైలో జరుగుతుంది. చిదంబరం స్టేడియంలో జరిగిన నాలుగో వన్డేలో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (140 బంతుల్లో 138; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) కెరీర్లో 23వ సెంచరీని సాధించగా, రైనా (52 బంతుల్లో 53; 3 ఫోర్లు, 1 సిక్స్), రహానే (53 బంతుల్లో 45; 4 ఫోర్లు) రాణించారు. స్టెయిన్, రబడ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్ (107 బంతుల్లో 112; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటంతో శతకం సాధించాడు. భువనేశ్వర్‌కు 3 వికెట్లు దక్కగా, హర్భజన్ 2 వికెట్లు తీశాడు. కీలక భాగస్వామ్యాలు ఓపెనర్లు రోహిత్ (21), ధావన్ (7) విఫలం కావడంతో భారత్ 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత రెండు సెంచరీ భాగస్వామ్యాలు జట్టు విజయానికి కీలకంగా నిలిచాయి. కోహ్లి, రహానే మూడో వికెట్‌కు 104 పరుగులు జోడించగా...ఆ తర్వాత కోహ్లి, రైనా 18.4 ఓవర్లలోనే 127 పరుగులు జత చేశారు. ముఖ్యంగా కోహ్లి చాలా కాలం తర్వాత తనదైన శైలిలో చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. రహానేను స్టెయిన్ అవుట్ చేయడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. రైనా నిలదొక్కుకునేందుకు సమయం తీసుకున్నా... ఆ తర్వాత జోరు పెంచి 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. మరో వైపు కండరాలు పట్టేయడంతో కొంత ఇబ్బంది పడుతూ బ్యాటింగ్ కొనసాగించిన కోహ్లి... ఫాంగిసో బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో 112 బంతుల్లో సెంచరీ మార్కుని అందుకున్నాడు. చివరి 5 ఓవర్లలో భారత్ 29 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోవడంతో స్కోరు 300 లోపే ఆగిపోయింది. డివిలియర్స్ మెరుపులు ఒక వైపు డి కాక్ (35 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా... ఆమ్లా (7) వైఫల్యం కొనసాగడంతో దక్షిణాఫ్రికాకు శుభారంభం దక్కలేదు. డు ప్లెసిస్ (17), మిల్లర్ (6) కూడా విఫలమయ్యారు. 11-20 ఓవర్ల మధ్య 32 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోవడం సఫారీలను దెబ్బ తీసింది. ఈ దశలో డివిలియర్స్, బెహర్దీన్ (22) కలిసి జట్టును రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే స్పిన్నర్లు హర్భజన్, మిశ్రా, అక్షర్ కట్టి పడేయడంతో ఆ జట్టు పరుగులు తీయడం కష్టమైపోయింది. ఇలాంటి స్థితిలోనూ ఎదురుదాడికి దిగి డివిలియర్స్ దూకుడుగా ఆడాడు. మిశ్రా బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టడంతో 98 బంతుల్లోనే అతని సెంచరీ పూర్తయింది. డివిలియర్స్ క్రీజ్‌లో ఉన్నంత సేపు ఒంటి చేత్తో గెలిపిస్తున్నట్లే అనిపించింది. అయితే భువీ వేసిన షార్ట్ పిచ్ బంతిని పుల్ షాట్ ఆడబోయి అతను ధోనికి క్యాచ్ ఇవ్వడంతో దక్షిణాఫ్రికా ఆశలు గల్లంతయ్యాయి. * కోహ్లి వన్డే కెరీర్లో ఇది 23వ సెంచరీ. ఓవరాల్ జాబితాలో సచిన్ (49), పాంటింగ్ (30), జయసూర్య (28), సంగక్కర (25) మాత్రమే అతనికంటే ముందున్నారు. * దక్షిణాఫ్రికాపై కోహ్లికి ఇది తొలి సెంచరీ. దీంతో అన్ని టెస్టు దేశాల (9) పైనా సెంచరీ చేసిన సచిన్, పాంటింగ్, గిబ్స్, ఆమ్లాల సరసన చేరాడు. * డివిలియర్స్‌కు ఇది 22వ సెంచరీ. దీంతో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. * భారత్‌కు ఇది 450వ వన్డే విజయం. ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా (533), పాకిస్తాన్ (451) మాత్రమే ఇంతకంటే ఎక్కువ విజయాలు సాధించాయి. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) డు ప్లెసిస్ (బి) మోరిస్ 21; ధావన్ (సి) డి కాక్ (బి) రబడ 7; కోహ్లి (సి) డి కాక్ (బి) రబడ 138; రహానే (సి) డి కాక్ (బి) స్టెయిన్ 45; రైనా (సి) డివిలియర్స్ (బి) స్టెయిన్ 53; ధోని (సి) డివిలియర్స్ (బి) స్టెయిన్ 15; హర్భజన్ (బి) రబడ 0; అక్షర్ (నాటౌట్) 4; భువనేశ్వర్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 299. వికెట్ల పతనం: 1-28; 2-35; 3-139; 4-266; 5-291; 6-291; 7-299; 8-299. బౌలింగ్: స్టెయిన్ 10-0-61-3; రబడ 10-0-54-3; మోరిస్ 9-0-55-1; ఫాంగిసో 9-0-51-0; తాహిర్ 9-0-58-0; బెహర్దీన్ 3-0-17-0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డి కాక్ (సి) రహానే (బి) హర్భజన్ 43; ఆమ్లా (సి) ధావన్ (బి) మోహిత్ 7; డు ప్లెసిస్ (సి) ధోని (బి) అక్షర్ 17; డివిలియర్స్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 112; మిల్లర్ (ఎల్బీ) (బి) హర్భజన్ 6; బెహర్దీన్ (ఎల్బీ) (బి) మిశ్రా 22; మోరిస్ (రనౌట్) 9; ఫాంగిసో (సి) అక్షర్ (బి) భువనేశ్వర్ 20; స్టెయిన్ (సి) రహానే (బి) భువనేశ్వర్ 6; రబడ (నాటౌట్) 8; తాహిర్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 264. వికెట్ల పతనం: 1-36; 2-67; 3-79; 4-88; 5-144; 6-185; 7-233; 8-250; 9-250. బౌలింగ్: భువనేశ్వర్ 10-0-68-3; మోహిత్ 10-0-48-1; హర్భజన్ 10-0-50-2; అక్షర్ 10-0-40-1; మిశ్రా 10-1-55-1. -
చెన్నైలో సఫారీలు చిత్తు
-
చెన్నైలో సఫారీలు చిత్తు
కీలక వన్డేలో భారత్ సమిష్టిగా రాణించింది. విజయ దశమి నాడు.. దక్షిణాఫ్రికాతో ఇక్కడ చిదంబరం స్టేడియంలో గురువారం జరుగుతున్న నాల్గో వన్డేలో 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్ మెన్ ఏబీ డివిలియర్స్ వీరోచిత సెంచరీ వృధా అయ్యింది. 300 పరుగుల భారీలక్ష్యంతో బరిలో దిగిన సౌతాప్రికా పరుగుల వేటలో చతికిల బడింది. టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో నిర్ణీత 50ఓవర్లలో9 వికెట్ల నష్టానికి 264 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఐదు వన్డేల ఫ్రీడమ్ సిరీస్ ను భారత్ 2-2తో సమం చేసినట్లైంది. తొలుత టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న టీమిండియా విరాట్ కోహ్లీ (138; 140 బంతుల్లో 6 ఫోర్లు,5 సిక్స్ లు) సెంచరీతో చెలరేగడంతో భారత్ 50 ఓవర్లకు 299 పరుగులు చేసింది. సిరీస్ లో నిలవాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో 35 పరుగులకే ఓపెనర్లు రోహిత్ శర్మ(21), శిఖర్ ధవన్(7) లు వికెట్లను కోల్పోయి కాస్త తడబడింది. ఈ దశలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తీసుకున్న కోహ్లి, అజింక్యా రహానేతో కలిసి మూడో వికెట్ కు 104 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రహానే(45) తృటిలో హాఫ్ సెంచరీని కోయి మూడో వికెట్ గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన సురేష్ రైనా ఆచితూచి ఆడుతూ కోహ్లికి సహకరించాడు. ఈ క్రమంలోనే రైనా (53;52 బంతుల్లో 3 ఫోర్లు,1 సిక్స్) హాఫ్ సెంచరీతో ఫామ్ లో కి వచ్చాడు. ఈ జోడి నాల్గో వికెట్ కు 127 రన్స్ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఓ దశలో 45ఓవర్లకు 270 పరుగులతో జోరుమీదున్న భారత్.. భారీ స్కోర్ దిశగా సాగింది. అయితే స్లాగ్ ఓవర్లలో దక్షిణాఫ్రికా బౌలర్లు రాణించడంతో టీమిండియా చివరి ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 29 పరుగులు మాత్రమే చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్టెయిన్, రబడాలకు తలో మూడు వికెట్లు లభించగా, క్రిస్ మోరిస్ ఒక వికెట్ దక్కింది. భారీ టార్గెట్ ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా తడబడింది. టీమిండియా స్పిన్నర్ల దెబ్బకు కుదేలైంది. 88 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ ఇన్సింగ్స్ ఆడిన ఏబీ డివిలియర్స్(112, 107బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సర్లు)తో ఒంటరి పోరాటం చేసి.. సఫారీలకు గెలుపుపై ఆశలు రేపాడు. జట్టు స్కోరు 233 వద్ద భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌన్సర్ తో ఏబీని పెవిలియన్ పంపడంతో.. భారత్ విజయం లాంఛనమైంది. చివర్లో టెయిల్ ఎండర్స్ కాసేపు భారీ షాట్లు బాదినా.. సఫారీల ఛేజింగ్ టార్గెట్ కు సుదూరంగా ఆగిపోయింది. నిర్నీత 50 ఓవర్లు ముగిసే సరికి 9వికెట్ల నష్టానికి కేవలం 264 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీసుకోగా.. హర్బజన్ సింగ్ 2, మోహిత్ శర్మ, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా తలా ఒక వికెట్ కూల్చారు. అద్భుత సెంచరీతో టీమిండియాను ఆదుకున్న విరాట్ కొహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆవార్డు లభించింది. కాగా.. ఈ సిరీస్ లో నిర్ణయాత్మక ఐదో వన్డే ఈనెల 25న ముంబాయి లో జరగనుంది. -
నాల్గో వన్డేలో భారత్ ఘనవిజయం
కీలక వన్డేలో భారత్ సమిష్టిగా రాణించింది. విజయ దశమి నాడు.. దక్షిణాఫ్రికాతో ఇక్కడ చిదంబరం స్టేడియంలో గురువారం జరిగిన నాలుగో వన్డేలో 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్ మెన్ ఏబీ డివిలియర్స్ వీరోచిత సెంచరీ వృధా అయ్యింది. 107 బంతుల్లో 112 పరుగులు చేసి డివిలియర్స్ అవుట్ అయ్యాడు. 300 పరుగుల భారీలక్ష్యంతో బరిలో దిగిన సౌతాప్రికా పరుగుల వేటలో చతికల బడింది. టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. దీంతో 35 పరుగుల ఆధిక్యంతో భారత్ విజయం సాధించింది. అంతకు ముందు భారత్ 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఈ విజయంతో ఫ్రీడమ్ సిరీస్ ను 2-2 తో టీమిండియా సమం చేసింది. -
నాలుగో వన్డేలో కివీస్ విజయం
అబుదాబి: విలియమ్సన్ (123; 12 ఫోర్లు), వెటోరి (3/53) రాణించడంతో పాకిస్తాన్‌తో జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ జట్టు ఏడు పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2-2తో సమంగా నిలిచింది. చివరిదైన ఐదో వన్డే నేడు జరుగనుంది. కివీస్ 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 299 పరుగులు చేసింది. పాక్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 292 పరుగులు చేసింది. యూనిస్ ఖాన్ సెంచరీ (117 బంతుల్లో 103; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) వృథా అయింది. -
ఎదురీదుతున్నశ్రీలంక
కోల్ కతా: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఈడెన్ గార్డెన్ లో గురువారం జరుగుతున్న నాల్గో వన్డేల శ్రీలంక ఎదురీదుతోంది. టీమిండియా విసిరిన 405 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ పెరీరా(0), చండీమాల్(9), మహేలా జయవర్దనే(2) వికెట్లను కోల్పోయింది. మరోప్రక్క దిల్షాన్ కాసేపు ఫర్వాలేదనిపించినా నాల్గో వికెట్టు రూపంలో వెనుదిరిగాడు. దిల్షాన్(34)పరుగులు చేసి అవుట్ కావడంతో శ్రీలంకకు కష్టాలు ఆరంభమయ్యాయి. ప్రస్తుతం 11.4 ఓవర్లలో శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయి 57 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్, స్టువర్ట్ బిన్నీలు చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా టీమిండియా 405 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత ఓపెనర్ రోహిత్ శర్మ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడి డబుల్ సెంచరీ( 264) చేయడంతో భారత్ భారీ స్కోరును నమోదు చేసింది. -
మూడో వికెట్టు కోల్పోయిన శ్రీలంక(42/3)
కోల్ కతా:టీమిండియాతో ఇక్కడ ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న నాల్గో వన్డేలో శ్రీలంక ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా విసిరిన 405 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన శ్రీలంక ఓపెనర్ పెరీరా(0) వికెట్టును కోల్పోయింది. మూడో బంతికే డకౌట్ గా నుదిరిగిన పెరీరా శ్రీలంకకు షాకిచ్చాడు. అనంతరం చండీమాల్ (9) పరుగులు చేసి రెండు వికెట్టుగా వెనుదిరగడంతో లంకేయులకు కష్టాలు ఆరంభమయ్యాయి. తరువాత దిల్షాన్ స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళుతున్న క్రమంలో మహేలా జయవర్ధనే(2) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ప్రస్తుతం 8.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక 42 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మరో ఓపెనర్ దిల్షాన్ (30)పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు లభించగా, స్టువర్ట బిన్నీకి ఒక వికెట్టు లభించింది -
శ్రీలంక విజయలక్ష్యం 405
కోల్ కతా: శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న నాల్గో వన్డేలో టీమిండియా 405 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ రోహిత్ శర్మ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడి డబుల్ సెంచరీ (264) చేయడంతో భారత్ భారీ స్కోరును నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలుత రెండు వికెట్లు ఆదిలోనే కోల్పోయి కష్టాల్లో పడ్డట్టు కనిపించిన టీమిండియాను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆదుకున్నారు. రోహిత్ కు కోహ్లీ జతకలవడంతో స్కోరు బోర్డు వేగంగా పరుగులెత్తింది. విరాట్ కోహ్లీ(66) పరుగులు చేసి పెవిలియన్ కు చేరిన అనంతరం రోహిత్ మరింత రెచ్చిపోయాడు. తొలుత హాఫ్ సెంచరీ చేయడానికి సమయం తీసుకున్న రోహిత్ శర్మ.. వంద స్ట్రైక్ రేట్ తో వంద పరుగులు పూర్తి చేశాడు. అదే వేగంతో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ వన్డేల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టించిన రోహిత్.. వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న 219 రికార్డును అధిగమించాడు. కేవలం 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్స్ ల సాయంతో 264 పరుగులను పూర్తి చేసిన రోహిత్.. చివరి బంతికి అవుటయ్యాడు. టీమిండియా ఆటగాళ్లలో అజ్యింకా రహానే (28), అంబటి రాయుడు (8), సురేష్ రైనా(11), రాబిన్ ఉతప్ప(16) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్లో కోల్పోయిన టీమిండియా 404 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో మాథ్యూస్ కు రెండు వికెట్లు లభించగా, కులశేఖర, ఎరంగాలకు తలో వికెట్టు దక్కింది. -
రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు
కోల్ కతా:శ్రీలంకతో ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న నాల్గో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీతో దుమ్ము రేపాడు. తుది రెండు వన్డేలకు జట్టులోకి వచ్చిన రోహిత్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. కేవలం 148 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 22 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో రెండో శతకాన్ని పూర్తిచేశాడు. అర్ధ సెంచరీ చేయడానికి సమయం తీసుకున్న రోహిత్ శర్మ.. ఆ తరువాత పదునైన షాట్లతో అలరించాడు. సెంచరీ చేయడానికి 100 బంతులను ఎదుర్కొన్న రోహిత్.. మరో సెంచరీకి 50 బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఈ తాజా డబుల్ సెంచరీతో రోహిత్ శర్మ వన్డేల్లో రెండో డబుల్ సెంచరీలు నమోదు చేసిన తొలి క్రికెటర్ గా చరిత్రకెక్కాడు. గతంలో ఆస్ట్రేలియాపై 209 పరుగులు చేసిన ఈ హైదరాబాదీ ఆటగాడు మరోసారి జూలు విదిల్చాడు. ఈ క్రమంలోనే వీరేంద్ర సెహ్వాగ్ వన్డే రికార్డును కూడా రోహిత్ అధిగమించాడు. కేవలం 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్స్ లతో 264 పరుగులను పూర్తి చేసిన రోహిత్.. చివరి బంతికి అవుటయ్యాడు. గతంలో సెహ్వాగ్ పేరిట ఉన్న 219 ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టి ప్రపంచ వన్డే చరిత్రలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. -
రోహిత్ శర్మ 150 నాటౌట్
కోల్ కతా:శ్రీలంకతో జరుగుతున్న నాల్గో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ తన బ్యాటింగ్ తో దుమ్ము రేపుతున్నాడు. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న నాల్గో వన్డేలో రోహిత్ (151 నాటౌట్; 125 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్స్ లు) లంక బౌలర్లను చీల్చి చెండాడుతున్నాడు. అతనికి జతగా విరాట్ కోహ్లీ సహకారం అందిచడంతో రోహిత్ మరింత రెచ్చిపోయాడు. శిఖర్ ధవన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన రోహిత్ ఓపెనర్ గా మరోసారి నిరూపించుకున్నాడు. పునరాగమనాన్ని ఘనంగా చాటిన రోహిత్ వన్డేల్లో ఐదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఓపెనర్ చలవతో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 40 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా 275 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (66)పరుగులు చేసి రనౌట్ గా వెనుదిరిగాడు. అంతకుముందు అజ్యింకా రహానే(28),రాయుడు (8)పరుగుల వద్ద పెవిలియన్ కు చేరిన సంగతి తెలిసిందే. -
రోహిత్ శర్మ సెంచరీ:భారీ స్కోరు దిశగా టీమిండియా
కోల్ కతా:శ్రీలంకతో ఇక్కడ ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న నాల్గో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో దుమ్ము రేపాడు. శిఖర్ ధవన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ 100 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. అంతకుముందు అర్ధ సెంచరీ చేయడానికి సమయం తీసుకున్న రోహిత్.. తరువాత రెచ్చిపోయాడు. వన్డేల్లో ఐదో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ తనదైన శైలిలో ఆడుతూ శ్రీలంక బౌలర్లకు చుక్కులు చూపించాడు.అతనికి జతగా కెప్టెన్ కోహ్లీ (45)పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ప్రస్తుతం 34 ఓవర్లలో రెండు వికెట్లు నష్టానికి 210 పరుగులతో టీమిండియా ఆటను కొనసాగిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆదిలోనే అజ్యింకా రహానే(28), అంబటి రాయుడు(8) వికెట్లను కోల్పోయిన సంగతి తెలిసిందే. -
నాల్గో వన్డేలో రోహిత్ శర్మ అర్ధ సెంచరీ
కోల్ కతా: శ్రీలంకతో ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న నాల్గో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఐదు వన్డేలో సిరీస్ లోభాగంగా చివరి రెండు వన్డేలకు జట్టులోకి వచ్చిన రోహిత్ చూడచక్కని షాట్లతో అలరించాడు. ఆదిలో క్రీజ్ లో కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకున్న రోహిత్ ఆరు ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ (65), విరాట్ కోహ్లీ (24) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. 26 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్లు 129 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.అంతకుముందు అజ్యింకా రహానే(28),అంబటి రాయుడు(8)పరుగులకే తమ వికెట్లను కోల్పోయారు. ఇప్పటికే టీమిండియా 3-0 తేడాతో సిరీస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. -
కోల్ కతాకు చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు
కోల్ కతా: శ్రీలంకతో వన్డే సిరీస్ ను గెలిచిన టీమిండియా ఆటగాళ్లు మంగళవారం కోల్ కతా నగరానికి చేరుకున్నారు. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఈడెన్ గార్డెన్ స్టేడియంలో జరుగునున్ననాల్గో వన్డేలో పాల్గొనేందుకు టీమిండియా ఆటగాళ్లు కోల్ కతాకు చేరుకున్నారు. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తో సహా చివరి రెండు వన్డేలకు ఎంపికైన ఆటగాళ్లు బుధవారం ఇక్కడికి చేరుకోనున్నారు. ఇప్పటికే సిరీస్ ను కోల్పోయిన శ్రీలంక ఆటగాళ్లు గత రాత్రి నగరానికి చేరుకున్నారు. గురువారం టీమిండియ-శ్రీలంకల మధ్య నాల్గో వన్డే జరుగునుంది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు కొన్ని ప్రయోగాలకు సిద్ధమయ్యాయి. మూడు వన్డేల్లో విశేషంగా రాణించిన శిఖర్ ధవన్ విశ్రాంతి కల్పించిన సెలెక్టర్లు రోహిత్ శర్మను మిగతా రెండు వన్డేలకు ఎంపిక చేశారు. రోహిత్ తో పాట రాబిన్ ఉతప్ప, కరణ్ శర్మ, వినయ్ కుమార్, కేదర్ యాదవ్ లు తిరిగి జట్టులోకి ఎంపిక చేశారు. -
ఎన్నాళ్లకెన్నేళ్లకు..!
24 సంవత్సరాల తర్వాత ఇంగ్లండ్‌లో వన్డే సిరీస్ గెలిచిన భారత్ నాలుగో వన్డేలోనూ ధోనిసేన ఘన విజయం 3-0తో సిరీస్ కైవసం శుక్రవారం ఆఖరి వన్డే టెస్టుల్లో బంతిని ముట్టుకోవడానికి భయపడిన కుర్రాళ్లు.. వన్డేల్లో ఆ బంతినే వెంటాడి వెంటాడి బాదారు.ఘోర పరాభవాన్ని చవి చూసిన గడ్డపై... అదే ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొట్టారు. అవమానంతో మౌనముద్ర దాల్చిన వాళ్లే... రొమ్మువిరిచి బెబ్బులిలా గర్జించారు. నాణ్యమైన ఆటతీరుకు సమష్టి మంత్రాన్ని జోడించి... దిగ్గజాలకూ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నారు.రెండు పుష్కరాలుగా బ్రిటిష్ గడ్డపై ఊరిస్తున్న వన్డే సిరీస్ విజయాన్ని... మరో మ్యాచ్ మిగిలుండగానే సాధించారు.మంచినీళ్ల ప్రాయంగా పరుగులతో హోరెత్తించి... ఏకపక్ష విజయాలతో భవిష్యత్‌కు భరోసా ఇచ్చారు. బర్మింగ్‌హామ్: ధావన్ (81 బంతుల్లో 97 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) మీసం మెలేశాడు... తన బ్యాట్ పవరేంటో చూపడానికి... రహానే (100 బంతుల్లో 106; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకంతో గర్జించాడు... ఇంగ్లండ్ గడ్డపై ధోనిసేనకు ఈ విజయం ఎంత కీలకమో చెప్పడానికి... ఓవరాల్‌గా ఒకే ఒక్క మ్యాచ్... భారత జట్టులో చాలా సమస్యలకు పరిష్కారం చూపింది. ఇంగ్లండ్ టూర్ మొదలైనప్పట్నించీ కనీసం 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయలేకపోయిన ఓపెనర్లు ఈ మ్యాచ్‌లో ఏకంగా 183 పరుగులు జోడించారు. అంటే ఓపెనింగ్ సమస్యకు పరిష్కారం చూపారు. ఊరించే వికెట్‌పై ఇంగ్లండ్‌ను కట్టడి చేస్తూ... బౌన్సీ వికెట్లపై రాణించలేరనే అపవాదును తొలగించుకున్నారు బౌలర్లు. రైనా, రాయుడు రాణించడంతో రిజర్వ్ బెంచ్ సత్తా ఏంటో చూపెట్టారు. ఫలితంగా నాలుగో వన్డేలో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో వన్డే మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 49.3 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. మొయిన్ అలీ (50 బంతుల్లో 67; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రూట్ (81 బంతుల్లో 44; 2 ఫోర్లు), మోర్గాన్ (58 బంతుల్లో 32; 3 ఫోర్లు)లు రాణించారు. ఓ దశలో 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కుక్ సేనను రూట్, మోర్గాన్‌లు నాలుగో వికెట్‌కు 80 పరుగులు జోడించి ఆదుకున్నారు. అయితే ఈ ఇద్దరు కూడా 11 పరుగుల వ్యవధిలో అవుట్ కావడంతో ఇంగ్లండ్ 114 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి మరోసారి కష్టాల్లో పడింది. కానీ చివర్లో అలీ భారీ షాట్లతో రెండు కీలక భాగస్వామ్యాలతో చెలరేగాడు. షమీ 3, భువనేశ్వర్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 30.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 212 పరుగులు చేసి గెలిచింది. ఆరంభంలో కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకున్న ధావన్ నెమ్మదిగా బ్యాట్ ఝుళిపించాడు. అండర్సన్ వేసిన ఐదో ఓవర్లో నాలుగు బౌండరీలు కొట్టి టచ్‌లోకి వచ్చాడు. రెండో ఎండ్‌లో రహానే కూడా చెలరేగాడు. ఈ ఇద్దరు క్రమంగా జోరు పెంచడంతో పరుగుల వరద పారింది. ఈ జోడిని విడదీయడానికి ఇంగ్లండ్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించలేదు. చివరకు కెరీర్లో తొలి సెంచరీ చేసిన రహానేను గుర్నీ అవుట్ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 183 పరుగులు జోడించారు. తర్వాత కోహ్లి (1 నాటౌట్)తో కలిసి ధావన్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. రహానేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరి వన్డే లీడ్స్‌లో శుక్రవారం జరుగుతుంది. స్కోరు వివరాలు: ఇంగ్లండ్ ఇన్నింగ్స్: కుక్ (సి) రైనా (బి) భువనేశ్వర్ 9; హేల్స్ (బి) భువనేశ్వర్ 6; బ్యాలెన్స్ (సి) రహానే (బి) షమీ 7; రూట్ (సి) కులకర్ణీ (బి) రైనా 44; మోర్గాన్ (సి) రైనా (బి) జడేజా 32; బట్లర్ ఎల్బీడబ్ల్యు (బి) షమీ 11; అలీ (బి) అశ్విన్ 67; వోక్స్ రనౌట్ 10; ఫిన్ (బి) జడేజా 2; అండర్సన్ నాటౌట్ 1; గుర్నీ (బి) షమీ 3; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం: (49.3 ఓవర్లలో ఆలౌట్) 206. వికెట్ల పతనం: 1-15; 2-16; 3-23; 4-103; 5-114; 6-164; 7-194; 8-201; 9-202; 10-206 బౌలింగ్: భువనేశ్వర్ 8-3-14-2; ధావల్ కులకర్ణీ 7-0-35-0; షమీ 7.3-1-28-3; అశ్విన్ 10-0-48-1; జడేజా 10-0-40-2; రైనా 7-0-36-1. భారత్ ఇన్నింగ్స్: రహానే (సి) కుక్ (బి) గుర్నీ 106; ధావన్ నాటౌట్ 97; కోహ్లి నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (30.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 212. వికెట్ల పతనం: 1-183 బౌలింగ్: అండర్సన్ 6-1-38-0; గుర్నీ 6.3-0-51-1; ఫిన్ 7-0-38-0; వోక్స్ 4-0-40-0; అలీ 7-0-40-0. 1 వన్డేల్లో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా ధోని (91) అగ్రస్థానంలో నిలిచాడు. అతని నాయకత్వంలో భారత్ 162 వన్డేల్లో 91 గెలిచి 57 ఓడింది. ప్రస్తుత అంతర్జాతీయ కెప్టెన్లలో మూడు ఫార్మాట్లలోనూ (టెస్టు 27, వన్డే 91, టి20 27) తన జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ ధోని ఒక్కడే. 1 33 వన్డేల్లో రహానేకు ఇది తొలి సెంచరీ 2 ఇంగ్లండ్ పర్యటనలో టెస్టులు, వన్డేల్లో సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడు రహానే. 2002లో సచిన్ మాత్రమే దీనిని సాధించాడు. 50 ఇంగ్లండ్‌పై ఇది భారత్‌కు 50వ వన్డే విజయం 1 200కు పైగా లక్ష్యం ఉన్నప్పుడు 117 బంతుల ముందే ఛేదించడం భారత్‌కు ఇదే తొలిసారి. తొలి మ్యాచ్‌తో పోలిస్తే ఇందులో మా ప్రదర్శన చాలా మెరుగుపడింది. ధావన్ ఫామ్‌లోకి వచ్చాడు. ఓపెనింగ్‌కు రహానే చక్కగా సరిపోతాడు. అయితే రోహిత్లో కూడా అపార నైపుణ్యం ఉంది. - ధోని (భారత కెప్టెన్) -
24 ఏళ్లకు టీమిండియా సిరీస్ కైవసం
బర్మింగ్ హమ్: భారత క్రికెట్ అభిమాని కోరిక తీరింది. ఎంతోమంది దిగ్గజాలకు అందని ఫలితం ధోనీ సేనకు దక్కింది. టెస్టుల్లో ఘోరంగా ఓడిన టీమిండియా.. వన్డేల్లో విశేషంగా రాణించి ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ ను కైవసం చేసుకుంది. దీంతో 24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా ఆటగాళ్లు సరికొత్త చరిత్రను లిఖించారు. మంగళవారం ఇంగ్లండ్ తో ఇక్కడ జరిగిన నాల్గో వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. గత రెండు వన్డేల్లో ప్రదర్శించిన ఊపునే కొనసాగించిన టీమిండియా ఆటగాళ్లు.. అదే విజయపరంపరను కొనసాగించి సిరీస్ 3-0 తేడాతో చేజిక్కించుకున్నారు. 207 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు ఓపెనర్లు రహానే, శిఖర్ థావన్ లు శుభారంభానిచ్చారు. రహానే (106), పరుగులు చేసి వన్డేల్లో తొలి సెంచరీ నమోదు చేయగా, మరో ఓపెనర్ శిఖర్ థావన్(97*) పరుగులతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆది నుంచి ఇంగ్లండ్ పై విరుచుకుపడిన భారత్.. కేవలం 30.3 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించింది. ఐదు వన్డేలకు గాను జరిగిన ఈ సిరీస్ లో ఇంకా ఒక మ్యాచ్ ఉండగానే టీమిండియా సిరీస్ దక్కించుకోవడం విశేషం. ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ ను టీమిండియా బౌలర్లు మరోమారు స్వల్ప పరుగులకే కట్టడి చేశారు. ఓపెనర్లు అలెస్టర్ కుక్(9),హేల్స్ (6)లను భువనేశ్వర్ కుమార్ ఆదిలోనే పెవిలియన్ కు పంపి ఇంగ్లండ్ కు షాకిచ్చాడు. అనంతరం బ్యాలెన్స్ (7) పరుగులకే పెవిలియన్ కు చేరడంతో ఇంగ్లండ్ తేరుకోలేకపోయింది. మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు రూట్ (44), మహ్మద్ ఆలీ(67)పరుగులు చేయడంతో ఇంగ్లండ్ 49.3 ఓవర్లలో 206 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీకి మూడు వికెట్లు లభించగా, జడేజా, భువనేశ్వర్ కుమార్ లకు తలో రెండు, అశ్విన్, రైనాలకు చెరో వికెట్టు దక్కింది. -
భారత బౌలర్ల విజృంభణ.. ఇంగ్లండ్ 206 ఆలౌట్
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో నాలుగో వన్డేలో భారత్ బౌలర్లు విజృంభించారు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 206 పరుగులకే కట్టడి చేశారు. అలీ 50 బంతుల్లో 67 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. భారత బౌలర్లలో షమీ మూడు, భువనేశ్వర్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీసేన విజయం దిశగా దూసుకెళ్తోంది. 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 88 పరుగులు చేసింది. ఓపెనర్లు రహానె, ధవన్ బాధ్యతాయుత బ్యాటింగ్ తో రాణిస్తున్నారు. అంతకుముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియాకు యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత ఆరంభాన్నిచ్చాడు. భువి ఒకే ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్లు హేల్స్, కుక్‌ను పెవలియన్ బాటపట్టించాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో భువి హేల్స్‌ను బౌల్డ్ చేయగా, కుక్.. రైనాకు క్యాచిచ్చాడు. దీంతో ఇంగ్లీష్ మెన్ 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్ షమీ ఆ వెంటనే బాలెన్స్‌ను అవుట్ చేసి ఇంగ్లండ్ కోలుకోనీకుండా చేశాడు. ఆ తర్వాత మోర్గాన్, రూట్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకట్ట వేసినా వేగంగా పరుగులు రాబట్టలేకపోయారు. భారత బౌలర్లు మోర్గాన్, రూట్ ను వెంటవెంటనే అవుట్ చేశారు. ఆ తర్వాత అలీ మినహా ఇతర ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో కుక్ సేన అతికష్టమ్మీద 200 పరుగుల మైలురాయి దాటింది. 2-0 ఆధిక్యంలో ఉన్న ధోనీసేన ఈ మ్యాచ్ నెగ్గితే సిరీస్ సొంతమవుతుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దవగా, రెండు, మూడు వన్డేల్లో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. -
రెచ్చిపోతున్న భారత బౌలర్లు
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో నాలుగో వన్డేలో భారత్ బౌలర్లు విజృంభిస్తున్నారు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియాకు యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత ఆరంభాన్నిచ్చాడు. భువి ఒకే ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్లు హేల్స్, కుక్‌ను పెవలియన్ బాటపట్టించాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో భువి హేల్స్‌ను బౌల్డ్ చేయగా, కుక్.. రైనాకు క్యాచిచ్చాడు. దీంతో ఇంగ్లీష్ మెన్ 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్ షమీ ఆ వెంటనే బాలెన్స్‌ను అవుట్ చేసి ఇంగ్లండ్ కోలుకోనీకుండా చేశాడు. ఇంగ్లండ్ 8 ఓవర్లలో 23 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మోర్గాన్, రూట్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకట్ట వేసినా నింపాదిగా ఆడారు. భారత బౌలర్లు మోర్గాన్, రూట్ ను వెంటవెంటనే అవుట్ చేశారు. ఇంగ్లండ్ 33 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి116 పరుగులు చేసింది. 2-0 ఆధిక్యంలో ఉన్న ధోనీసేన ఈ మ్యాచ్ నెగ్గితే సిరీస్ సొంతమవుతుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దవగా, రెండు, మూడు వన్డేల్లో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. -
నాలుగో వన్డే: ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో నాలుగో వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ మ్యాచ్ మంగళవారం జరుగుతోంది. 2-0 ఆధిక్యంలో ఉన్న ధోనీసేన ఈ మ్యాచ్ నెగ్గితే సిరీస్ సొంతమవుతుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దవగా, రెండు, మూడు వన్డేల్లో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. సిరీస్ గెలిచే అవకాశాల్లేని ఇంగ్లండ్ కనీసం సమం చేయాలన్నా చివరి రెండు వన్డేలు నెగ్గి తీరాలి. దీంతో ఈ మ్యాచ్ కుక్ సేనకు చావోరేవో లాంటిది. ఒత్తిడిలో ఉన్న ఇంగ్లీష్ మెన్ ఏ మేరకు రాణిస్తారో చూడాలి. కాగా ధోనీసేన సమరోత్సాహంతో బరిలోకి దిగుతోంది. -
కరువు తీరే సమయం!
మ. గం. 3.00 నుంచి స్టార్ స్పోర్ట్స్ 1, దూరదర్శన్లలో ప్రత్యక్ష ప్రసారం 24 ఏళ్ల తర్వాత సిరీస్ విజయానికి చేరువలో భారత్ నేడు ఇంగ్లండ్‌తో నాలుగో వన్డే జోరు మీదున్న ధోని సేన తీవ్ర ఒత్తిడిలో కుక్ బృందం రెండు పుష్కరాలుగా భారత క్రికెట్ అభిమాని కోరిక... ఎంతోమంది దిగ్గజాలకు అంద ని ఫలితం... గొప్ప సారథులకూ దక్కని ఘనత... వీటన్నింటినీ అందుకునే అవకాశం ధోనిసేనకు లభించింది. 24 ఏళ్లుగా ఇంగ్లండ్ గడ్డపై భారత్ ఒక్క వన్డే సిరీస్ కూడా గెలవలేదు. ఈసారి మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే.. 2-0 ఆధిక్యంలో ఉన్న ధోనిసేన... ఇక రెండింట్లో ఒక్కటి గెలిచినా చాలు. అయితే ఆఖరి మ్యాచ్‌లో ఒత్తిడిని ఎదుర్కొనేకంటే... నాలుగో వన్డేలో గెలిచి కల సాకారం చేసుకుంటేనే మేలు. బర్మింగ్‌హామ్: వన్డే ప్రపంచ చాంపియన్ భారత్ ఈ ఫార్మాట్లో తమ సత్తా ఏమిటో ఇప్పటికే ఇంగ్లండ్‌కు రుచి చూపించింది. ఇదే ఉత్సాహంతో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ధోని సేన పట్టుదలగా ఉంది. మరో వైపు ఇంకా ఇంగ్లండ్ జట్టు టెస్టు మైకం నుంచి బయటపడినట్లు లేదు. సాంప్రదాయ శైలితోనే ఆడబోతూ గత రెండు మ్యాచ్‌ల్లో ఏ దశలోనూ ఆ జట్టు భారత్‌కు పోటీ ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో నేడు (మంగళవారం) ఇక్కడి ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే జరగనుంది. సిరీస్‌లో రెండు వన్డేలు నెగ్గిన భారత్, ఈ మ్యాచ్ గెలిస్తే మరో వన్డే మిగిలుండగానే 3-0తో సిరీస్‌ను గెలుచుకుంటుంది. విజయ్‌కి అవకాశం ఇస్తారా! ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మరోసారి నంబర్‌వన్‌గా నిలవడం నాలుగో వన్డేకు ముందు భారత్‌కు స్ఫూర్తినిచ్చే మరో అంశం. గత రెండు మ్యాచ్‌ల ప్రదర్శనను బట్టి చూస్తే భారత జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో కూడా మన కుర్రాళ్లు చెలరేగిపోతున్నారు. ఓపెనర్‌గా రహానే గత వన్డేలో ఆకట్టుకున్నాడు. కోహ్లి, రైనా, రాయుడు, ధోనిలతో మిడిలార్డర్ పటిష్టంగా ఉండగా, ఆ తర్వాత ఆల్‌రౌండర్లు జడేజా, అశ్విన్‌లు ఉన్నారు. బౌలింగ్‌లో కూడా పేసర్లు భువనేశ్వర్, షమీ ప్రధాన పాత్ర పోషిస్తుండగా...మూడో వన్డేలో గాయపడిన మోహిత్ ఫిట్‌గా లేకపోతే ఉమేశ్‌కు అవకాశం ఇవ్వవచ్చు. సాధారణంగా వరుస విజయాల సమయంలో టీమిండియా తుది జట్టులో మార్పులు జరగవు. అయితే గాయపడిన ఓపెనర్ రోహిత్ శర్మ స్థానంలో మురళీ విజయ్‌ని హడావిడిగా భారత్‌నుంచి పిలిపించారు. ప్రపంచ కప్‌కు ముందు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలించడం కూడా ఇందుకు కారణం కావచ్చు. కాబట్టి వరుసగా విఫలమవుతున్న శిఖర్ ధావన్ స్థానంలో విజయ్‌ని ఓపెనర్‌గా పరీక్షించే అవకాశం లేకపోలేదు. అన్నీ కష్టాలే! మరో వైపు ఇంగ్లండ్ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. గత 20 వన్డేల్లో ఆ జట్టు 12 ఓడింది. ఆ జట్టు ఆటగాళ్లలో ఒకరిద్దరు మినహా మిగతా వారెవరూ వన్డే ఫార్మాట్‌కు అనుగుణంగా తమను తాము మలచుకోలేకపోతున్నారు. ఓపెనర్‌గా హేల్స్ సత్తా చాటుతుండగా...మరో ఓపెనర్ కుక్ బ్యాటింగ్ అంతంత మాత్రంగానే ఉంది. టెస్టు సిరీస్‌లో తన నాయకత్వంపై విమర్శలు వచ్చిన సమయంలో 3-1తో సిరీస్ నెగ్గి సమాధానమిచ్చిన కుక్... ఇప్పుడు వన్డే సిరీస్ కోల్పోకూడదంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అసలు భారత బ్యాటింగ్‌ను అడ్డుకునే బౌలింగ్ కానీ...భారత స్పిన్‌ను ఎదుర్కొనే సత్తా గానీ ఇంగ్లండ్‌కు లేనట్టే కనిపిస్తోంది. వన్డే స్పెషలిస్ట్ మోర్గాన్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోగా...కీపర్ బట్లర్ మాత్రం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక ఆ జట్టు బౌలింగ్ అయితే మరీ నాసిరకంగా ఉంది. ఒక్కరు కూడా భారత బ్యాట్స్‌మెన్‌కు పగ్గాలు వేయలేకపోతున్నారు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ స్టోక్స్ స్థానంలో మరో స్పిన్నర్‌గా మొయిన్ అలీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. సిరీస్ గెలిచే అవకాశం ఎలాగూ లేకపోయినా, ఓడిపోకుండా ఉండాలంటే ఇంగ్లండ్ ఈ మ్యాచ్ నెగ్గడం తప్పనిసరి. జట్ల వివరాలు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), ధావన్/విజయ్, రహానే, కోహ్లి, రైనా, రాయుడు, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, మోహిత్. ఇంగ్లండ్: కుక్ (కెప్టెన్), హేల్స్, బెల్/బాలెన్స్, రూట్, మోర్గాన్, బట్లర్, వోక్స్, అలీ, ట్రెడ్‌వెల్, ఫిన్, అండర్సన్. పిచ్ వాతావరణం సాధారణంగా ఇక్కడి వికెట్ స్లోగా ఉండి స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఇంగ్లండ్‌తో గత సిరీస్‌లో శ్రీలంక దీనిని సమర్థంగా వాడుకుంది. అయితే భారత్ దీనిని అనుకూలంగా మార్చుకోకూడదని భావిస్తున్న ఇంగ్లండ్... పిచ్‌పై కొంత గడ్డి ఉంచాలని కోరుతోంది. వాతావరణం అంతా బాగుంది. ఎలాంటి వర్ష సూచన లేదు. టికెట్ల అమ్మకం కూడా భారీగా సాగింది. పూర్తి మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. 4 ఇక్కడ ఆడిన 7 మ్యాచుల్లో భారత్ 4 గెలిచింది. 1 మరో మ్యాచ్ గెలిస్తే అజహర్ (90)ను దాటి అత్యధిక వన్డే విజయాలు అందించిన భారత కెప్టెన్‌గా (91) ధోని నిలుస్తాడు. -
ఉత్కంఠ పోరులో శ్రీలంక విజయం
లండన్: బ్యాటింగ్‌లో సెంచరీతో సంగక్కర (104 బంతుల్లో 112; 14 ఫోర్లు), బౌలింగ్‌లో మూడు వికెట్లతో మలింగ (3/52) చెలరేగడంతో... ఇంగ్లండ్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన నాలుగో వన్డేలో శ్రీలంక 7 పరుగులతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 300 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసింది. ఒక దశలో 111 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఇక్కట్లలో పడిన ఇంగ్లండ్‌ను జోస్ బట్లర్ (74 బంతుల్లో 121; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. అయితే ఆఖరి 3 బంతుల్లో 9 పరుగులు అవసరమైన దశలో బట్లర్ రనౌట్ కావడంతో ఇంగ్లండ్ గెలుపు అంచుల దాకా వచ్చి ఓడింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమమైంది. చివరి వన్డే ఈ నెల 3న జరగనుంది. -
అవే తప్పులు
చేసిన తప్పులను సరిదిద్దుకోకపోతే ఫలితాల్లో పెద్దగా మార్పు ఉండదు... భారత క్రికెట్ జట్టు ఈ విషయాన్ని గుర్తించలేకపోయింది. వరుసగా రెండు వన్డేల్లో ఓడి... మూడో మ్యాచ్‌లో చావుతప్పి కన్నులొట్టబోయినట్లుగా టై చేసుకున్నా... అటు బ్యాట్స్‌మెన్, ఇటు బౌలర్లు ఎవరూ మారలేదు. ఫలితంగా నాలుగో వన్డేలోనూ ధోనిసేన చిత్తయింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-0తో న్యూజిలాండ్ వశమయింది. హామిల్టన్: ‘కీలక సమయంలో వికెట్లను చేజార్చుకోవడం, ఎక్కడ బంతులు వేయాలో బౌలర్లు తెలుసుకోకపోవడం... సిరీస్‌లో ఈ రెండూ మా తప్పులు. వీటిని పునరావృతం చేయడమే నాలుగో వన్డేలోనూ మా కొంపముంచింది’... సిరీస్ ఓటమి తర్వాత ధోని వ్యాఖ్య ఇది. కెప్టెన్ మాటలు పూర్తిగా వాస్తవం. భారత్ ఆల్‌రౌండ్ వైఫ్యల్యంతో... మంగళవారం జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 278 పరుగులు చేసింది. రోహిత్ (94 బంతుల్లో 79; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), ధోని (73 బంతుల్లో 79 నాటౌట్, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), జడేజా (54 బంతుల్లో 62 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా... రాయుడు (58 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపిం చాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో 3 వికెట్లకు 280 పరుగులు చేసి గెలిచింది. టేలర్ (127 బంతుల్లో 112; 15 ఫోర్లు) సెంచరీ చేయగా.. విలియమ్సన్ (82 బంతుల్లో 60; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రెండన్ మెకల్లమ్ (36 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుగ్గా ఆడారు. టేలర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆఖరి వన్డే శుక్రవారం వెల్లింగ్టన్లో జరుగుతుంది. రో‘హిట్’ ఈ మ్యాచ్ కోసం భారత్ ధావన్, రైనాల స్థానంలో బిన్నీ, రాయుడులను తెచ్చింది. దీంతో రోహిత్‌తో కలిసి కోహ్లి ఓపెనర్‌గా వచ్చాడు. కోహ్లి (2), రహానే (3) విఫలం కావడంతో భారత్ 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రాయుడు, రోహిత్ మూడో వికెట్‌కు 79 పరుగులు జోడించి ఆదుకున్నారు. నాణ్యమైన క్రికెట్‌తో ఆకట్టుకున్న రాయుడు... బంతి బౌన్స్‌ను అంచనా వేయడంలో విఫలమై అవుటయ్యాడు. రోహిత్ ఓ చెత్త షాట్‌తో వెనుదిరిగాడు. అశ్విన్ కూడా వెంటనే అవుటయ్యాడు. దీంతో భారత్ 151 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. ధోని, జడేజా కొద్దిసేపు జాగ్రత్తగా ఆడి స్లాగ్ ఓవర్లలో చెలరేగారు. దీంతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు లభించింది. చివరి 10 ఓవర్లలో ధోని, జడేజా 100 పరుగులు సాధించడం విశేషం. న్యూజిలాండ్ బౌలర్లలో సౌతీ 2 వికెట్లు తీశాడు. టేలర్ నిలకడ న్యూజిలాండ్ ఓపెనర్లు గుప్టిల్ (27 బంతుల్లో 35; 6 ఫోర్లు, 1 సిక్సర్), రైడర్ (18 బంతుల్లో 19; 4 ఫోర్లు) వేగంగా ఆడి భారత్‌పై ఒత్తిడి పెంచారు. అయితే నాలుగు పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరూ పెవిలియన్‌కు చేరారు. కానీ ఫామ్‌లో ఉన్న విలియమ్సన్, టేలర్ కలిసి మూడో వికెట్‌కు 130 పరుగులు జోడించి భారత్ ఆశలపై నీళ్లు జల్లారు. సిరీస్‌లో వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ అర్ధసెంచరీ చేసిన విలియమ్సన్ అవుటైనా... కెప్టెన్ మెకల్లమ్, టేలర్ కలిసి లాంఛనాన్ని పూర్తి చేశారు. కెరీర్లో 9వ సెంచరీ చేసిన టేలర్ కెప్టెన్ మెకల్లమ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు అజేయంగా 92 పరుగులు జోడించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రోంచీ (బి) విలియమ్సన్ 79; కోహ్లి (సి) నీషమ్ (బి) సౌతీ 2; రహనే (సి) సౌతీ (బి) మిల్స్ 3; రాయుడు (సి) రోంచీ (బి) బిన్నెట్ 37; ధోని నాటౌట్ 79; అశ్విన్ (సి) బిన్నెట్ (బి) సౌతీ 5; జడేజా నాటౌట్ 62; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం: (50 ఓవర్లలో 5 వికెట్లకు) 278. వికెట్ల పతనం: 1-5; 2-22; 3-101; 4-142; 5-151 బౌలింగ్: మిల్స్ 10-2-42-1; సౌతీ 10-1-36-2; బిన్నెట్ 9-0-67-1; నీషమ్ 8-0-59-0; నాథన్ మెకల్లమ్ 10-0-44-0; విలియమ్సన్ 3-0-26-1 న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గుప్టిల్ ఎల్బీడబ్ల్యు (బి) షమీ 35; రైడర్ (బి) ఆరోన్ 19; విలియమ్సన్ రనౌట్ 60; టేలర్ నాటౌట్ 112; బి.మెకల్లమ్ నాటౌట్ 49; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (48.1 ఓవర్లలో 3 వికెట్లకు) 280. వికెట్ల పతనం: 1-54; 2-58; 3-188 బౌలింగ్: భువనేశ్వర్ 10-0-62-0; షమీ 8-0-61-1; ఆరోన్ 6.1-0-51-1; జడేజా 10-2-33-0; అశ్విన్ 10-0-41-0; బిన్నీ 1-0-8-0; రాయుడు 3-0-23-0. బౌలర్లు బుర్ర వాడాలి: ధోని ‘వన్డేల్లో కొత్త నిబంధనలను బౌలర్లకు శాపమే. కానీ ఈ పర్యటనలో మేం దానివల్ల ఓడిపోలేదు. చెత్త బౌలింగ్ కొంప ముంచింది. సిరీస్ అంతటా షార్ట్, వైడ్ బంతులే వేశారు. మా బౌలర్లు కాస్త బుర్ర కూడా వాడితే బాగుంటుంది’. 1 12 ఏళ్ల తర్వాత భారత్‌పై సిరీస్ గెలవడం న్యూజిలాండ్‌కు ఇదే తొలిసారి 1 మరొక్క పరుగు చేస్తే ధోని వన్డేల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు