కోల్ కతా:శ్రీలంకతో జరుగుతున్న నాల్గో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ తన బ్యాటింగ్ తో దుమ్ము రేపుతున్నాడు. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న నాల్గో వన్డేలో రోహిత్ (151 నాటౌట్; 125 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్స్ లు) లంక బౌలర్లను చీల్చి చెండాడుతున్నాడు. అతనికి జతగా విరాట్ కోహ్లీ సహకారం అందిచడంతో రోహిత్ మరింత రెచ్చిపోయాడు. శిఖర్ ధవన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన రోహిత్ ఓపెనర్ గా మరోసారి నిరూపించుకున్నాడు. పునరాగమనాన్ని ఘనంగా చాటిన రోహిత్ వన్డేల్లో ఐదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఓపెనర్ చలవతో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.
ప్రస్తుతం 40 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా 275 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (66)పరుగులు చేసి రనౌట్ గా వెనుదిరిగాడు. అంతకుముందు అజ్యింకా రహానే(28),రాయుడు (8)పరుగుల వద్ద పెవిలియన్ కు చేరిన సంగతి తెలిసిందే.