బర్మింగ్హామ్: ఇంగ్లండ్తో నాలుగో వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఈ మ్యాచ్ మంగళవారం జరుగుతోంది. 2-0 ఆధిక్యంలో ఉన్న ధోనీసేన ఈ మ్యాచ్ నెగ్గితే సిరీస్ సొంతమవుతుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దవగా, రెండు, మూడు వన్డేల్లో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే.
సిరీస్ గెలిచే అవకాశాల్లేని ఇంగ్లండ్ కనీసం సమం చేయాలన్నా చివరి రెండు వన్డేలు నెగ్గి తీరాలి. దీంతో ఈ మ్యాచ్ కుక్ సేనకు చావోరేవో లాంటిది. ఒత్తిడిలో ఉన్న ఇంగ్లీష్ మెన్ ఏ మేరకు రాణిస్తారో చూడాలి. కాగా ధోనీసేన సమరోత్సాహంతో బరిలోకి దిగుతోంది.
నాలుగో వన్డే: ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
Published Tue, Sep 2 2014 3:01 PM | Last Updated on Sat, Sep 2 2017 12:46 PM
Advertisement
Advertisement