
మూడో వికెట్టు కోల్పోయిన శ్రీలంక(42/3)
టీమిండియాతో ఇక్కడ ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న డే అండ్ నైట్ నాల్గో వన్డేలో శ్రీలంక ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
కోల్ కతా:టీమిండియాతో ఇక్కడ ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న నాల్గో వన్డేలో శ్రీలంక ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా విసిరిన 405 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన శ్రీలంక ఓపెనర్ పెరీరా(0) వికెట్టును కోల్పోయింది. మూడో బంతికే డకౌట్ గా నుదిరిగిన పెరీరా శ్రీలంకకు షాకిచ్చాడు. అనంతరం చండీమాల్ (9) పరుగులు చేసి రెండు వికెట్టుగా వెనుదిరగడంతో లంకేయులకు కష్టాలు ఆరంభమయ్యాయి. తరువాత దిల్షాన్ స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళుతున్న క్రమంలో మహేలా జయవర్ధనే(2) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు.
ప్రస్తుతం 8.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక 42 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మరో ఓపెనర్ దిల్షాన్ (30)పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు లభించగా, స్టువర్ట బిన్నీకి ఒక వికెట్టు లభించింది