
రోహిత్ శర్మ సెంచరీ:భారీ స్కోరు దిశగా టీమిండియా
కోల్ కతా:శ్రీలంకతో ఇక్కడ ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న నాల్గో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో దుమ్ము రేపాడు. శిఖర్ ధవన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ 100 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. అంతకుముందు అర్ధ సెంచరీ చేయడానికి సమయం తీసుకున్న రోహిత్.. తరువాత రెచ్చిపోయాడు. వన్డేల్లో ఐదో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ తనదైన శైలిలో ఆడుతూ శ్రీలంక బౌలర్లకు చుక్కులు చూపించాడు.అతనికి జతగా కెప్టెన్ కోహ్లీ (45)పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ప్రస్తుతం 34 ఓవర్లలో రెండు వికెట్లు నష్టానికి 210 పరుగులతో టీమిండియా ఆటను కొనసాగిస్తోంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆదిలోనే అజ్యింకా రహానే(28), అంబటి రాయుడు(8) వికెట్లను కోల్పోయిన సంగతి తెలిసిందే.