
రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు
కోల్ కతా:శ్రీలంకతో ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న నాల్గో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీతో దుమ్ము రేపాడు. తుది రెండు వన్డేలకు జట్టులోకి వచ్చిన రోహిత్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. కేవలం 148 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 22 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో రెండో శతకాన్ని పూర్తిచేశాడు. అర్ధ సెంచరీ చేయడానికి సమయం తీసుకున్న రోహిత్ శర్మ.. ఆ తరువాత పదునైన షాట్లతో అలరించాడు. సెంచరీ చేయడానికి 100 బంతులను ఎదుర్కొన్న రోహిత్.. మరో సెంచరీకి 50 బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఈ తాజా డబుల్ సెంచరీతో రోహిత్ శర్మ వన్డేల్లో రెండో డబుల్ సెంచరీలు నమోదు చేసిన తొలి క్రికెటర్ గా చరిత్రకెక్కాడు. గతంలో ఆస్ట్రేలియాపై 209 పరుగులు చేసిన ఈ హైదరాబాదీ ఆటగాడు మరోసారి జూలు విదిల్చాడు. ఈ క్రమంలోనే వీరేంద్ర సెహ్వాగ్ వన్డే రికార్డును కూడా రోహిత్ అధిగమించాడు.
కేవలం 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్స్ లతో 264 పరుగులను పూర్తి చేసిన రోహిత్.. చివరి బంతికి అవుటయ్యాడు.
గతంలో సెహ్వాగ్ పేరిట ఉన్న 219 ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టి ప్రపంచ వన్డే చరిత్రలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.