కోల్ కతా: శ్రీలంకతో ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న నాల్గో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఐదు వన్డేలో సిరీస్ లోభాగంగా చివరి రెండు వన్డేలకు జట్టులోకి వచ్చిన రోహిత్ చూడచక్కని షాట్లతో అలరించాడు. ఆదిలో క్రీజ్ లో కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకున్న రోహిత్ ఆరు ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ (65), విరాట్ కోహ్లీ (24) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
26 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్లు 129 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.అంతకుముందు అజ్యింకా రహానే(28),అంబటి రాయుడు(8)పరుగులకే తమ వికెట్లను కోల్పోయారు. ఇప్పటికే టీమిండియా 3-0 తేడాతో సిరీస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.